Home /News /crime /

CYBER CRIMINALS DECEIVE THE INNOCENT IN HYDERABAD VB

Cyber crime: ఆశ చూపుతారు.. అంతా దోచేస్తారు.. హైదరాబాద్ లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyber crime: సైబర్ నేరగాళ్ల పంతాలు రోజుకో విధంగా మారుతున్నాయి. మోసం చేయడానికి ఉన్న ప్రతీ మార్గాలను వెతుకుతున్నారు. దీంతో అమాయకులు వారి మాయలో పడి లబోదిబోమంటున్నారు. ఓ వ్యక్తి ఇలాంటి సైబర్ వలలో చిక్కుకొని పోలీసులను ఆశ్రయించాడు.

  మీరు రూ.100 మా పేటీఎం కు పంపిస్తే మీకు అదనంగా 25 శాతం డబ్బులు ఇస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పంపండి అంటూ మెస్సెజ్ వస్తుంది. తక్కువ అమౌంటే కదా అని వాళ్లు పంపిన నంబర్ కు పంపిస్తాం. వాళ్లు తెలివిగా రూ. 125 వెంటనే మన పేటీఎం కు పంపుతారు. కొద్దిగ నమ్మకం వస్తుంది. ఆ తర్వాత రూ. 200 పంపండి అంటూ మరో మెస్సేజ్ వస్తుంది. అలాగే అని పంపిన వెంటనే రూ.250 పంపిస్తాడు. ఇలా అవతలి వ్యక్తి నమ్మకం వచ్చేలా చేస్తారు. ఇక్కడ నుంచి వాళ్ల ప్లాన్ ను అమలు చేస్తారు. ఎక్కువ అమౌంట్ వచ్చేదాకా వారి వద్ద నుంచి పలు దఫాలుగా వసూలు చేస్తారు. వారికి కావాల్సిన అమౌంట్ వచ్చిని తర్వాత గప్ చిప్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇలా సైబర్ నేరగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకొని దోచేస్తున్నారు. అలాంటిదే హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ లో కొంత మంది బాధ్యులు వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

  ఏప్రిల్ 10వ తారీఖున సుచిత్ర బ్యాంకు కాలనీకి చెందిన వి. వినయ్‌రెడ్డి(22) ఫోన్‌కు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా ట్రేడ్‌ అఫిషియల్‌ నుంచి ట్రేడింగ్‌ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించేందుకు చేస్తున్నానని పత్రాలతో కూడిన సందేశం వచ్చింది. ఆ పత్రాలు చూసిన వ్యక్తి నమ్మే విధంగా ఉండటంతో పూర్తి గా నమ్మేశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఓ నంబర్‌కు రూ. 2000 పేటీఎం ద్వారా పంపివ్వడంతో వెంటనే అతని ఖాతా కు రూ.2,450 వచ్చాయి. వెంటనే ఆ వ్యక్తి నంబర్ కు మరో మెసేజ్ వచ్చింది. రూ. 5000 పంపిస్తే మరింత ఎక్కువ లాభం వస్తుందని ఆశచూపడంతో సదరు వ్యక్తి అదే నంబర్‌కు మరో రూ. 5వేలు పంపించాడు. ఇక్కడ నుంచి తిరకాసు మొదలైంది. మరో రూ.5 వేలు పంపిస్తే స్లాట్ బుక్ అవుతుందని.. లేదంటే మీరు పంపిన రూ.5 వేలు వెనక్కి తిరిగి రావని చెప్పడంతో మరో రూ. 5వేలు అదనంగా పంపించాడు. కొద్దిసేపటికి రూ.10 వేల స్లాట్ లు అన్ని అయిపోయాయని రూ. 20 వేలకు స్లాట్ ఉందని మరో నంబర్‌ ద్వారా చెప్పడంతో మరో రూ. 10వేలు పేటీఎం ద్వారా చెల్లించాడు. అదనపు లాభం కోసం ఎదురు చూశాడు. వారికి ఫోన్ చేసేందుకు ప్రయత్నం చేయగా ఎలాంటి స్పందన రాలేదు. చివరకు మోసపోయానని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
  ఓటీపీ రాకుండా డబ్బు మాయం..
  బాలానగర్‌లో ఫార్మా లిమెటెడ్‌లో సీనియర్‌ అసోషియేట్‌గా పని చేస్తున్న కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పద్మానగర్‌ఫేస్‌-2 రింగ్‌రోడ్‌ ప్రాంతానికి చెందిన వీరగంటి శ్రీరామ్‌ రంజిత్‌కుమార్‌(31) క్రెడిట్ కార్డు నుంచి ఎలాంటి ఓటీపీ రాకుండా రూ.61 వేలు డెబిట్ అయ్యాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి బాధ్యులు పెరిగిపోయారని..ఫిర్యాదు చేసే వారి సంఖ్య పెరుగుతోందని.. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పేట్‌ బషీరాబాద్‌ సీఐ రమేశ్‌ సూచించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, CYBER CRIME, Cyber criminals, Cyberabad police, Hyderabad, Kuthbullapur, Medchal, Pet bashirabad, Telangana crime, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు