CYBER CRIMINALS ARE COLLECTING MONEY BY TEXTING THE AUTHORITIES BY PUTTING A COLLECTOR DP ON WHATSAPP FULL DETAILS HERE ADB PRV
Collector Frauds: వీళ్లు మామూలోళ్లు కాదుగా.. హలో.. నేను జిల్లా కలెక్టర్‌ను.. నాకొక చిన్న సమస్య వచ్చింది.. సాయం చేస్తారా? అంటూ..
(ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఆదమరిస్తే అంతే సంగతులు. వీరు వారు అన్న తేడా లేకుండా కేటుగాళ్లు అందరిని బురిడి కొట్టిస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్లను కూడా వదిలిపెట్టలేదు ఆ కేటుగాళ్లు. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా అది మాత్రం నిజం.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు (Online frauds), సైబర్ నేరాలు (Cyber frauds) ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఆదమరిస్తే అంతే సంగతులు. వీరు వారు అన్న తేడా లేకుండా కేటుగాళ్లు అందరిని బురిడి కొట్టిస్తున్నారు. సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలతో నకిలీ వాట్సాప్ ఖాతాలు (WhatsApp accounts) సృష్టించి, వారి సంబంధీకులు, పరిచయస్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. చివరకు జిల్లా కలెక్టర్ల (District collectors)ను కూడా వదిలిపెట్టలేదు ఆ కేటుగాళ్లు. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా అది మాత్రం నిజం. మొన్న నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్, నిన్న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కలెకర్, తాజాగ్ కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad)జిల్లా కలెక్టర్ ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు కలెక్టర్ ల పేరిట నకిలి వాట్సాప్ ఖాతాలు (fake WhatsApp Accounts) తెరిచి మోసాలకు తెరలేపిన ఘటనలు వెలుగుచూశాయి. అప్రమత్తమైన అధికారులు వాటి కట్టడికి చర్యలు చేపట్టారు.
కలెక్టర్‌తో సమావేశంలో ఉండగానే..
ఆదిలాబాద్ (Adilabad) కు చెందిన ఓ వైద్యుడు ఈ నఖీలి వాట్సాప్ ద్వారా వచ్చిన మెస్సెజ్ (Message) కు స్పందించి 30 వేల రూపాయలు నష్ట పోయాడు. అది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఫోటో (Collector Photo) డీపీ (DP)గా పెట్టిన వాట్సాప్ మెస్సెజ్ ద్వారా డబ్బులు అడగడం బయటపడింది. అయితే ఆదిలాబాద్ కలెక్టర్ అధికారులతో సమావేశమై ఉన్న సమయంలో కలెక్టర్ డీపీ ఉన్న మొబైల్ నెంబరు నుంచి డబ్బులు పంపాలని వాట్సాప్ మెస్సెజ్ లు వచ్చాయి. అయితే ఆశ్చర్యపోయిన కొందరు తమ ఎదురుగా ఉన్న కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
ఫోన్ చేయలేకపోతున్నానని..
తాను సమావేశంలో ఉన్నానని, ఫోన్ చేయలేకపోతున్నానని, డబ్బులు అవసరం ఉంది వెంటనే పంపగలరన్న అర్ధంలో కలెక్టర్ డీపీతో ఉన్న మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ మెస్సెజ్ లు వచ్చాయి. అయితే అసలు విషయం తెలియని ఓ ప్రభుత్వ వైద్యుడు ఇది నిజమేనని భావించి తన కుటుంబీకుల ద్వారా పది వేల రూపాయల విలువైన పది ఆమెజాన్ కూపన్లు (Amazon Coupons) కొని పంపారు. ఆ తర్వాత మళ్ళీ లక్షన్నర రూపాయలు కావాలంటు మరో మెస్సెజ్ రావడంతో అనుమానం కలిగిన ఆ వైద్యుడు కలెక్టరేట్ లో అధికారులను సంప్రదించాడు. దీంతో అసలు విషయం బయటపడి తాను మోసపోయానని గ్రహించి కొనుగోలు చేసిన కూపన్లను క్యాన్సిల్ చేస్తూ వెళ్ళారు. అప్పటికే ఆ వ్యక్తి మూడు కూపన్లను వాడుకోవడంతో 30 వేల రూపాయలు నష్టపోయిన వైద్యులు 70 వేల రూపాయలను మాత్రం తిరిగి రాబట్టుకోగలిగాడు.
అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరిట..
జిల్లాలోని ఓ మండల రెవెన్యూ అధికారికి కూడా ఇలాగే డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు రావడంతో కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి అనంతరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గడిచిన 24 గంటల్లోనే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఫోటో డిపిగా పెట్టి డబ్బులు అడుగుతూ పలువురు అధికారులకు మెస్సెజ్‌లకు వెళ్ళడం గుర్తించారు. అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరిట మోసం చేసే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలి ఫారూఖి పేరిట ఆగంతకులు నకిలీ ఖాతా తెరిచారు. కలెక్టర్ ప్రొఫైల్‌తో నకిలీ వాట్సప్ సందేశాలు వస్తున్నాయని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తంమీద ఉమ్మడి జిల్లాలో ఇలా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ల పెరిటనే బురిడి కొట్టించేందుకు సైబర్ మోసగాళ్ళు చేసిన ప్రయత్నాలు జిల్లాలో కలకలం రేపాయని చెప్పవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.