Home /News /crime /

Paytm, Google Pay యూజర్లూ...తస్మాత్ జాగ్రత్త

Paytm, Google Pay యూజర్లూ...తస్మాత్ జాగ్రత్త

మీరు ఒకే రోజు ఇవన్నీ చేసినా కూడా 2జీబీ డేటా పూర్తిగా వినియోగించుకున్నట్టు కాదు. ఇంకా డేటా మిగిలి ఉంటుంది. ప్రస్తుతం మనకి డైలీ డేటా కంటే కూడా మరింత స్పీడ్ అవసరం.

మీరు ఒకే రోజు ఇవన్నీ చేసినా కూడా 2జీబీ డేటా పూర్తిగా వినియోగించుకున్నట్టు కాదు. ఇంకా డేటా మిగిలి ఉంటుంది. ప్రస్తుతం మనకి డైలీ డేటా కంటే కూడా మరింత స్పీడ్ అవసరం.

లాక్ డౌన్ కారణంగా చాలామంది మొబైల్ పేమెంట్స్ యాప్స్ వాడుతున్నారు. పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు.

  కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. గడిచిన పది రోజులుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది మొబైల్ పేమెంట్స్ యాప్స్ వాడుతున్నారు. పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. దీన్నే ఆసరాగా చేసుకోవాలని కొందరు సైబర్ నేరగాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. పేటీఎం బ్లాక్ అవుతుందని, రీ యాక్టివేట్ చేసుకోవాలని సందేశాలు పంపుతున్నారు. అకౌంట్ యాక్టివేట్ అయ్యేందుకు ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ వంటి యాప్‌లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

  ఆయా యాప్‌ల సహాయంతో ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఖాతాల్లో ఉన్న డబ్బులు మొత్తం క్షణాల్లో ఖాళీ చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ గడిచిన కొద్ది రోజులుగా ఈ తరహా మోసాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. పేటీఎం సంస్థ అకారణంగా ఖాతాను నిలుపుదల చేయదని, ఒకవేళ ఖాతా నిలిచిపోయినా యాప్‌లోని కస్టమర్ కేర్ సర్వీస్‌ను మాత్రమే సంప్రదించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. హ్యాకింగ్ ద్వారా మన మొబైల్ వేరెవరో ఆపరేట్ చేస్తున్నట్టు ఏ మాత్రం సందేహం కలిగినా ఫోన్‌ను స్విచాఫ్ చేయాలని పేర్కొంటున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CYBER CRIME, Google pay, Paytm

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు