హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : టాలీవుడ్ సినీ నటులే టార్గెట్.. అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

Crime : టాలీవుడ్ సినీ నటులే టార్గెట్.. అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రాలు (File Photos)

ప్రతీకాత్మక చిత్రాలు (File Photos)

Crime : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు.. ఆధారాలు లేకుండా పెడితే అడ్డంగా బుక్కవుతారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మాగ్జిమం మూడేళ్లు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. మరి అతను ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్‌లో ట్రెండీగా నిలుస్తున్న మహిళా సినీ నటులను టార్గెట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సినీ నటులు, యాంకర్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడుతున్నాడని తెలిసింది. ప్రధానంగా.. అనసూయ, రష్మీ, విష్ణుప్రియ, ప్రగతి వంటి నటీమణుల పోస్టులు ఉండటంతో.. కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితుడు రామవెంకట వీరాంజనేయులును అరెస్టు చేశారు. అతను సాయిరవి 267 అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతూ.. అసభ్యకర వీడియోలు, ఫొటోలు ట్వీట్‌ చేసి నటీమణులను వేధిస్తున్నట్లు తెలిసింది.

అతనెవరు?

ఆంధ్రప్రదేశ్.. కోనసీమ జిల్లా.. పసలపూడికి చెందిన 30 ఏళ్ల పండరి రామవెంకట వీరాంజనేయులు ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి కంప్యూటర్ నాలెడ్జ్ కొంత ఉంది. ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లపై పట్టు ఉంది. ఈ నాలెడ్జిని మంచి పనులకు ఉపయోగిస్తే బాగుండేది. కానీ అతని మైండ్ క్రైమ్ యాంగిల్ వెతుక్కుంది. సినీ నటీమణులను టార్గెట్ చేస్తూ.. శాడిస్టిక్ ఆనందం పొందేవాడు.

సాయిరవి 267 పేరుతో ట్విటర్‌లో అకౌంట్ ప్రారంభించి.. అందులో టాలీవుడ్‌కి చెందిన నటీమణుల వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్య పదాలు రాసి.. పోస్ట్ చేస్తున్నాడు. ఆ ట్వీట్లను తన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నాడు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఫీలవుతున్నాడు. నేరం ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఈ పోస్టుల సంగతి యాంకర్ అనసూయకి తెలిసింది. ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.

ఎలా కనిపెట్టారు?

ఇలాంటి కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం చాలా తేలిక. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ట్వీట్లను పరిశీలించారు. అతను ఏ ఇంటర్నెట్ ఐపీ అడ్రెస్ ద్వారా ఈ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నాడో తెలుసుకున్నారు. తద్వారా అతని ప్రజెంట్, పర్మనెంట్ అడ్రెస్, ఫోన్ నంబర్, ఆధార్ అన్ని వివరాలూ తెలుసుకున్నారు. తర్వాత ఏపీకి వెళ్లారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకొని.. రెండ్రోజుల్లో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు ఏసీపీ శ్రీధర్ తెలిపారు.

Viral Video : ఆకులో ఆకునై.. మాయా గొంగళి పురుగు.. వీడియో చూడండి

సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా.. దానికి వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నాకు తెలియదు అనే ఛాన్సే ఉండదు. పైగా ఆ పోస్ట్ పక్కా ఆధారంగా ఉంటుంది. కాబట్టి కోర్టులో కూడా తప్పించుకునే ఛాన్స్ ఉండదు. చాలా మంది తెలిసే ఇలాంటి నేరాలు చేస్తుంటే.. మరికొందరు తెలియక ఈ తప్పులు చేస్తున్నారు. ఎలా చేసినా.. నేరం-శిక్ష నుంచి తప్పించుకోలేరు కాబట్టి.. పోస్ట్ పెట్టే ముందు ఆలోచించుకోమని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

First published:

Tags: Anasuya bardwaj, Anchor rashmi, Crime news, Tollywood actress

ఉత్తమ కథలు