Home /News /crime /

Cyber Crime: అక్కా అక్కా అంటున్నాడు కదా అని పక్కింటి పిల్లాడికి ఫోన్ ఇస్తే వాడు చేసిన ఘనకార్యం ఇది..

Cyber Crime: అక్కా అక్కా అంటున్నాడు కదా అని పక్కింటి పిల్లాడికి ఫోన్ ఇస్తే వాడు చేసిన ఘనకార్యం ఇది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crime: ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది.

  ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత సమాచారం ఇచ్చి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. వివరాల్లోకెళితే.. ఆమె ఓ మెడికల్ విద్యార్థిని. ఆమె ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది. ఆ పిల్లాడు.. ఆమె ఫోన్ లో పాస్ వర్డ్ మార్చి.. అక్కడ నుంచి ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు.

  ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ వాపోయింది. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు అయితే.. చివరకు వేధింపులు తట్టుకోలేక యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

  రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు.

  దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. అయితే.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి తీవ్ర నిరాశకు గురైంది.ఇలా ఎవర్ని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

  ఇది కూడా చదవండి :  చరిత్రలో గొప్ప అందగత్తె క్లియోపాత్రా సౌందర్య రహస్యం ఇదే..! ఆ ఒక్క నూనెతో..

  మరో ఘటనలో హర్యానాలోని పల్వాల్‌లో జరిగిన రెండు నెలల హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మృతుడి భార్య అతని మేనల్లుడితో కలిసి ఈ హత్యకు పాల్పడింది. మృతుడి భార్య, మేనల్లుడి మధ్య అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

  ఇది కూడా చదవండి : ఛీ.. ఛీ.. భర్తను కాదని 14 ఏళ్ల బాలుడితో 40 ఏళ్ల మహిళ పాడుపని.. ఆరుగురు పిల్లల తల్లి ఇలా..

  ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వాల్‌లోని హోడల్ ప్రాంతంలో నివసించే మహేష్ అక్టోబర్ 8న తన తమ్ముడు తారాచంద్, నగరంలోని రోజ్ నర్సింగ్ హోమ్‌లో పనికి వెళ్లాడని అక్టోబర్ 9న హోడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వారు అతని కోసం వెతకడం ప్రారంభించారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Crime, Crime news, CYBER CRIME

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు