Cyber Cheating: సీఎం కార్యాలయం నుండి అంటూ ఫోన్..! అంగన్వాడీ కార్యకర్తలను వదలని సైబర్ నేరగాళ్లు

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: సైబర్ నేరగాళ్లు రోజు రోజు కూ రెచ్చిపోతున్నారు. మోసం చేయడంలో కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. నేరుగా సీఎం కార్యాలయం నుంచే ఫోన్లు చేస్తున్నామని మోసాలకు పాల్పడుతున్నారు.

 • Share this:
  అన్నారఘు, న్యూస్ 18, గుంటూరు

  Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. మోసం చేయడం కోసం చిన్న చిన్న ఉద్యోగులు, పేదలను కూడా మోసగిస్తున్నారు. డబ్బులు సంపాదించడం కోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతుక్కోవడంతో మోస పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా (Guntur district) ప్రత్తిపాడు మండలంలోని అంగన్వాడీ  (Anganwadi) కార్యకర్తల ఫోన్ కు వచ్చిన కాల్ షాకిచ్చింది. తాము సీఎం కార్యాలయం నుండి  ఫోన్ చేస్తున్నామని.. మీరు చేసిన సేవలకు గాను 50 వేల రూపాయలు బహుమతిగా పంపించాలనుకుంటున్నాం అంటూ అవతల వ్యక్తులు మాట్లాడారు.  మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి అంటూ అడిగారు. అన్ని డిటైల్స్ కరెక్టుగా చెప్పడంతో నిజంగానే సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి కాల్ వచ్చిందని అంతా భావించారు. కాసేపటికి ఫోన్ నెంబర్​కు వచ్చిన ఓటీపీ చెప్తే.. మీ ఖాతాలో డబ్బులు పడతాయని నమ్మించారు.

  దీంతో తమకు వచ్చిన వన్ టైం పాస్ వర్డ్ ను చెప్పడంతో  చెప్పటం తో వారి అకౌంట్ లు కాళీ అయ్యాయి. ముగ్గురు ఖాతాల నుండి సుమారు లక్ష వరకూ మాయం  అయ్యాయి. దీంతో వారంతా లబోదిబోమంటూ  సైబర్  పోలీసులను ఆశ్రయించారు,. అయితే ఓటీపీ చెప్పొద్దని ఎన్ని సార్లు ఎంతమంది చెప్పినా.. కొందరు మాత్రం పదే పదే మోసపోతున్నారు. ప్రజల అమాయకత్వమే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది..

  ఇదీ చదవండి: ఏపీకి థర్డ్ వేవ్ టెన్షన్ తప్పదా? తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..?

  ఆంధ్రప్రదేశ్ లోని  సైబర్ నేరాల్లో 30 శాతం పెరుగుదల నమోదైందని ప్రముఖ యాంటీ వైరస్ (Anti Virus) సంస్థ క్విక్ హీల్ (Quick heal) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సెల్ ఫోన్ల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు పెరుగుతుండటంతో నేరాలూ అదే స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. ఇవే కాక ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న నేరాలూ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. 

  ఇదీ చదవండి: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి.. జగన్ సర్కార్ కు మరో షాక్

  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ ఎక్కడ నుంచి వచ్చింది..? చేసింది ఎవరు అని ఆరా తీసే పనిలో పడ్డారు. అసలు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేశామని చెప్పడంతో మరింత అలర్ట్ అయ్యారు. అదే పేరుతో ఇంకెంతమందిని మోసం చేసి ఉంటారో అని ఆందోళన చెందుతున్నారు..

  ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో నిఫా భయం.. మరో ప్రమాదం తప్పదా? అసలు నిఫా కథేంటి?

  ఇంకవరైనా బాధితులు ఉంటే వెంటనే సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ఎవరు చేసినా.. తెలిసిన వాళ్లే అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ నెంబర్ మాత్రం చెప్పొద్దని సూచిస్తున్నారు. మోసపోయిన వెంటనే పోలీసులను కూడా సంప్రదిచాలని కోరుతున్నారు. అలాగే ఇటీవల ఇంకెవరికైనా సీఎం కార్యాలయం అని చెప్పి ఫోన్లు వచ్చాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: