కొత్త జంట కాపురంలో కలకలం...శృంగార వీడియోలు బూతు సైటులో కనపడగానే..భర్తకు షాక్...

ఇంటి యజమాని మంచి వ్యక్తి కావడంతో వాళ్లు సంతోషించారు. అయితే అంతలోనే ఓ అనుకోని పరిణామం ఆ దంపతుల జీవితంలో కలకలం రేపింది.

news18-telugu
Updated: July 4, 2020, 7:27 PM IST
కొత్త జంట కాపురంలో కలకలం...శృంగార వీడియోలు బూతు సైటులో కనపడగానే..భర్తకు షాక్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
దంపతులు బెడ్ రూంలో ఏకాంతంగా శృంగారం చేసుకుంటున్న వీడియోలు బూతు సైట్లో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో వారిద్దరి నోట మాట రాలేదు. ఇలా ఎలా జరిగిందా అని తలపట్టుకొని సైబర్ క్రైంను ఆశ్రయించిన ఘటన బెంగుళూరులో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే...రాహుల్ (పేరు మార్పు), సౌందర్య ( పేరు మార్పు) ఇద్దరూ కలిసి స్థానికంగా సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తమ ఆఫీసుకు సమీపంలోనే ఓ ఇంట్లో అద్దెకు దిగారు. అయితే ఇంటి యజమాని మంచి వ్యక్తి కావడంతో వాళ్లు సంతోషించారు. అయితే అంతలోనే ఓ అనుకోని పరిణామం ఆ దంపతుల జీవితంలో కలకలం రేపింది. ఇంటి యజమాని కొడుకు వ్యసనాల బారిన పడి, డబ్బు సంపాదన కోసం ఆ యువజంట బెడ్రూంలో వారికి తెలియకుండా రహస్యం కెమెరా ఏర్పాటు చేశాడు. అందులో వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన క్లిప్పింగ్స్ బూతు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. ఈ వికృతచేష్టలను పొరపాటున రాహుల్ ఓ పోర్న్ వెబ్ సైట్ లో చూసి షాక్ తిన్నాడు.

పోలీసులను కలవాలా వద్దా...అని సంశయిస్తూనే..ఎవరిని అనుమానించాలో తెలియక చివరకు సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా నిందితుడి ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రేస్ చేసి ఆ కామాంధుడి కోసం బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి యజమాని కుమారుడే ఇలాంటి వికృత పనులు చేయడంతో వారు షాక్ తిన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: July 4, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading