CYBER CRIME CASES INCRESING YEAR BY YEAR IN HYDERABAD VRY BK
Hyderabad : సైబర్ నేరగాళ్లు వీటిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు... జాగ్రత్తా..! పెరుగుతున్న సైబర్ నేరాలు.. కారణాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Telangana news : తెలంగాణలోప్రతి సంవత్సరం సైబర్ క్రైం రేటు పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే వారు కొన్ని రంగాల్లోని వారిపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.. అయితే ఆయా పేర్లతో వస్తున్న కాల్స్, మెయిల్స్‌పై జాగ్రత్తలు వహించాలని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ సంఖ్య పది శాతానికి పెరిగిందంటే ఏస్థాయిలో సిటీలో ఈ క్రైమ్స్ జరుగుతున్నయో మనం అర్ధం చేసుకుకోవచ్చు. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య రెండింతలు నమోదైంది. తెలంగాణలో 2020లో 2,691 కేసులు నమోదు కాగా, 2021లో లక్ష జనాభాకు 13.4 కేసుల చొప్పున సైబర్ నేరాల సంఖ్య 8,024కి పెరిగింది. అయితే కోవిడ్ లాక్ డౌన టైంలో ఈ కేసులు సంఖ్య మరింత పెరిగిందని అంటున్నారు అధికారులు. ముఖ్యంగా సినియర్ సిటిజన్స్ నే టార్గెట్ గా చేసుకోని ఈ సైబర్ నేరగాళ్లు విఫరీతంగా రెచ్చిపోతున్నారు. అయితే ప్రస్తుతం సిటిలో జరుగుతున్న పలు సైబర్ క్రైమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైబర్ నేరగాళ్లు ఎలా మోసాలు చేస్తోన్నారో ఏఏ పద్దతులు ఇప్పుడు అవలంబిస్తోన్నారో చూద్దాం.
ఫేక్ లింక్స్ : ఇమెయిల్, సోషల్ మీడియా, టెక్స్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మెసేజ్ లు పంపి అందులో లింగ్ ను క్లిక్ చేయమనడం ద్వారా మన ఫోన్ లేదా కంప్యూటర్ లోకి ఒక సాఫ్ట్ వేర్ పంపించి మన డేటాను దొంగలించడం మన ఖాతాలో ఉన్న డబ్బులు వేరే ఖాతాలకు మళ్లించడం లాంటి సంఘటనుల ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. స్కామర్లు ప్రభుత్వ ఏజెన్సీలు, ఇకామర్స్ సైట్లను ప్రధానంగా ఇక్కడ సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తోన్నారు. దీంతో బాధితులు బుట్టలోపడుతున్నారు.
డేటింగ్ యాప్స్ : సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగించే పద్దతుల్లో ఇది ఒకటి కొన్ని డేటింగ్ యాప్ ల ద్వార అమ్మాయిలను ఎర వేసి బాధితులను ఆకట్టుకుని తరువాత వాళ్ల నుంచి అందినకాడకు దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాలు కూడా సిటీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తరహా మోసాలను బ్లాక్మెయిల్ స్కామ్‌లు అని కూడా అంటారు.
కస్టమర్ సపోర్ట్ స్కామ్‌లు – నకిలీ టోల్ ఫ్రీ/నకిలీ కస్టమర్ సపోర్ట్ నంబర్లు: ప్రముఖ కంపెనీలకు సంబంధిచిన అధికారిక కస్టమర్ సపోర్ట్ సెంటర్లు రూపంలో ఫేక్ నెంబర్ ను క్రియేట్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు.బాధితుడు కాల్ చేసిన తర్వాత వారి వివరాలు తీసుకొని తరువాత మళ్లి కాల్ చేసి మన అకౌంట్ లో ఉన్న మొత్తాని కాజేస్తారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్‌లు : డేటా ఎంట్రీ వర్క్స్ పేరుతో ఈ మోసాలు సాగుతాయి. ఇవి సిటీలో జరుగుతున్న అత్యంత సాధారణమైన మోసాలు. పెనాల్టీ క్లాజ్ అగ్రిమెంట్‌పై సంతకం చేయమని మిమ్మల్ని అడుగుతారు, పని ప్రారంభించిన తర్వాత, వారు తప్పు డేటా సాకుతో ఫైన్ లు వేయడం అవి కట్టడానికి నిరాకరించిన వారికి నకిలీ కోర్టు పోలీసు నోటీసులు పంపడం ద్వారా డబ్బును దోపిడీ చేస్తారు.
ఫ్రైజ్ మనీ మోసాలు: ఈమోసాల పై ప్రజల్లో దాదాపుగా అవగాహాన పెరిగినప్పటికి అక్కడక్కడ ఇవి జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇన్ని లక్షల డబ్బు మీ మొబైల్ నంబర్ కు వచ్చింది అది మీకు పంపాలంటే ఈ కొరియర్ చార్జీలు ఫే చేయాలని మోసాం చేస్తారు. ఇలా ఫే చేసిన తరువాత ఇ మరికొన్ని ఛార్జీలని అందినకాడకు దోచుకుంటారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.