• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CYBER CRIME CASES INCREASING IN GUNTURU MS GNT

Cyber Crime: ఫోన్ ఎత్తితే.. పైసలు పోయినట్టే.. గుంటూరులో పెరుగుతున్న సైబర్ నేరాలు

Cyber Crime: ఫోన్ ఎత్తితే.. పైసలు పోయినట్టే.. గుంటూరులో పెరుగుతున్న సైబర్ నేరాలు

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crimes In Gunturu: ఒకప్పుడు నిరక్షరాస్యులను మాత్రమే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్ళు.. ఇప్పుడు రూటు మార్చారు. కొద్దికాలంగా వాళ్లు విద్యావంతులు, ఉద్యోగులను సైతం వదలడం లేదు. కొద్దిరోజులుగా గుంటూరు నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.

  • News18
  • Last Updated:
  • Share this:
    గుంటూరు జిల్లాలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వినియోగదారుని కార్డు నంబరు, ఓ.టి.పి వంటి అంశాలతో సంబంధం లేకుండా ప్రజలను దోచుకుంటున్న ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పుడు నిరక్షరాస్యులను మాత్రమే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్ళు.. ఇప్పుడు రూటు మార్చారు. కొద్దికాలంగా వాళ్లు విద్యావంతులు, ఉద్యోగులను సైతం వదలడం లేదు. కొద్దిరోజులుగా గుంటూరు నగరంలో సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో ఇక్కడ సవివరంగా చూద్దాం.

    గుంటూరు నగరానికి చెందిన షేక్ మాజిబ్ అనే సివిల్ ఇంజనీర్ కు ఈ నెల 11వ తారీఖున ఫోన్ కాల్ వచ్చింది. అవతల వైపు నుండి మాట్లాడిన వ్యక్తి తాము జైపూర్ లోని ప్రముఖ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామంటూ పరిచయం చేసుకున్నాడు. మీ ఖాతాలో రూ. 20,000 నగదు ATM ద్వారా విత్ డ్రా చేశారా..? అంటూ ప్రశ్నించాడు. అయితే తాను ఎలాంటి విత్ డ్రా చేయలేదని తెలియజేయడంతో.. మీ బ్యాంక్ ఖాతా నుండి వేరెవరో నగదు విత్ డ్రా చేశారని.. అందు వలన మీ ATM CARD ని బ్లాక్ చేస్తున్నామని.. మీరు సమీపం లోని బ్యాంక్ కు వెళ్ళి అధికారులను సంప్రదించమని తెలిపి కాల్ ని కట్ చేశారు.

    ఆ కాల్ కట్ చేసిన వెంటనే మూడు విడతలుగా మాజిబ్ ఖాతా నుండి రూ. 20,000 నగదు విత్ డ్రా చేసినట్టు మెసేజ్ లు రావడంతో ఖంగుతిన్న అతను బ్యాంక్ కు వెళ్ళగా వారు టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయమని సూచించారు.టోల్ ఫ్రీ నంబరు కి కాల్ చేయగా వారు బ్యాంక్ లో సంప్రదించమంటూ ఒకరిపై ఒకరు చెప్పు కోవడంతో చేసేది లేక గుంటూరు అర్బన్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏ.ఎస్పి సిబ్బందిని ఆదేశించారు.

    మరొక నేరంలో లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి అంటూ డబ్బులు వసూలు చేసే ముఠాలు అధికమయ్యాయని అర్బన్ ఏ.ఎస్పి కి బాలక్రిష్ణ అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు.

    ఇటువంటిదే మరో ఘటన... ఈ కామర్స్ సంస్థల్లో భాగస్వామ్యం ఇప్పిస్తా మంటూ తన వద్ద నుండి విడతలవారీగా కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి మాయమాటలు చెప్పి నకిలీ డీలర్షిప్ అగ్రిమెంట్ పత్రాలు పంపించారు. జి.ఎస్టి కోసం అంటూ, సాఫ్ట్ వేర్ అంటూ విడతలవారీగా లక్షా యాభైవేల రూపాయలు వసూలు చేశారంటూ గుంటూరు క్రైమ్ ఏ ఎస్పీ మనోహరరావుకు బాధితుడు కుమార్ ఫిర్యాదు చేశాడు. ఏది ఏమైనా సైబర్ నేరాలపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు