CYBER CRIME 12 YEAR OLD BOY SHARES AUNT BATH VIDEO TO FRIENDS BY PLAYING TRUTH OR DARE GAME SRD
Cyber Crime : వయస్సు 12 ఏళ్లు..ఆడుకోవడానికని ఫోన్ ఇస్తే..పిన్ని పిన్ని అంటూనే పాడు పని..సొంత అక్క కొడుకే..
ప్రతీకాత్మక చిత్రం
Cyber Crime : సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల సంగతి అటుంచితే యువతీ యువకులు సులభంగా సోషల్ మీడియా ద్వారా బాధితులవుతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన.
ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల సంగతి అటుంచితే యువతీ యువకులు సులభంగా సోషల్ మీడియా ద్వారా బాధితులవుతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన. అమల (పేరు మార్చడమైనది)కు ఇంజనీరింగ్ లో సీటు రావడంతో తన పెద్దమ్మ కూతురైన గీత ఇంట్లో ఉండి చదువుకుంటోంది. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. వారి కొడుకు రాజా (పేరు మార్చడమైనది) ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అమల ముభావంగా ఉండటం, తనలో తనే బాధపడటం చూసిన గీత ఏమైందని అడిగింది. అయినా, ఏమీ చెప్పలేకపోయింది అమల. కానీ, గీత గట్టిగా అడిగేసరికి ‘చచ్చిపోతాను’ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సమస్య ఏంటని సముదాయిస్తూ అడిగేసరికి తన ఫోన్ చూపించింది గీత. అమల స్నానం చేస్తుండగా ఎవరో తీసిన వీడియో అది. ఆ వీడియో ఏదో వెబ్సైట్లో ఉందని, స్నేహితురాలు తనకు షేర్ చేసిందని ఏడుస్తూ చెప్పింది . గీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. విషయాన్ని భర్తతో చెప్పింది. ఎటువైపు నుంచి ఏ దుండగుడు ఆ వీడియోను తీశాడో తెలియలేదు. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది.
అమల స్నానం చేస్తుండగా రాజా తీసిన వీడియో అది అని తేలి, ఇంట్లో అంతా ఉలిక్కిపడ్డారు. ఇలాగే, వారి ఇంటి పక్కనే ఉంటున్న అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ల నుంచీ వీడియోలు తీస్తున్నాడనే విషయాన్ని రాబట్టారు. రాజా ఫోన్లో ఉన్న వీడియోలు చూస్తే ఇలాంటి వీడియోలు పదికి పైగానే ఉన్నాయి. ఇంత దారుణాన్ని పన్నెండేళ్ల పిల్లవాడు చేశాడంటే ఎవరికీ నమ్మబుద్ధికాలేదు. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పనివేళలూ ఎక్కువే. పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని స్మార్ట్‌ఫోన్, గేమ్స్ ఆడుకోవడానికి ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశారు. రవి స్కూల్ టైమ్ అయిపోగానే వాటిని ముందేసుకునేవాడు. పెద్దవాళ్లు కూడా పిల్లవాడు తమను విసిగించుకుండా ఖాళీ సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నాడని అనుకున్నారు. డిజిటల్ గేమ్స్ వల్ల మెదడు కూడా చురుకుగా మారుతుందని భావించారు.
అయితే, గేమ్‌లో భాగంగా ఆన్లైన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో భాగస్థుడయ్యాడు రవి. ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లో భాగంగా టీనేజర్లు ఒక్కో సాహసక్రియకు పూనుకోవాలనేది ఛాలెంజ్. అందులో ఎవరికి ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో భాగంగా టీనేజర్లు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి, వీడియోలను షేర్ చేసుకుంటూ వస్తున్నారని తెలిసింది. ఇలాంటి పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పుడు నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చీటికి మాటికి చేతికి ఫోన్ ఇచ్చి పిల్లల్ని పాడు చేయెద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.