USA: అగ్రరాజ్యం అమెరికా ఐటి సంస్థ‌పై సైబ‌ర్ దాడి.. 500 కోట్ల రూపాయల డిమాండ్

ప్రతీకాత్మక చిత్రం

USA: అమెరికాను హ్యాకర్లు తీవ్రంగా భయపెడుతున్నారు. తాజాగా అమెరికాలోని ప్రముఖ కంపెనీలపై సైబర్ అటాక్ జరిగింది. 520 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే ఈ సైబర్ ఎటాక్ చేసింది ఎవరు..? రష్యా పాత్ర ఏమైనా ఉందా అని అమెరికా ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

  • Share this:
    అగ్రరాజ్యం అమెరికాకు సైబర్ ముప్పు తప్పడం లేదు. వరుసగా హ్యాకర్స్ ఆ దేశంపై దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ర‌ష్యాకు చెందిన హ్యాక‌ర్స్ దాడికి అమెరికా కంపెనీలు హడలిపోతున్నాయి. అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం క‌సేయాపై హ్యాక‌ర్స్ గ్యాంగ్ రాన్స‌మ్‌వేర్ తో దాడులు చేసింది. ఈ దాడుల కార‌ణంగా వందలాది వ్యాప‌ర సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌కు బ్రేక్ ప‌డింది. అమెరికాతో స‌హా మొత్తం 17 దేశాల‌పై ఈ సైబ‌ర్ దాడులు జ‌రిగాయి. ర‌ష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఈ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఆయా కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాల‌జీపై సైబ‌ర్ నేర‌గాళ్లు రాన్స‌మ్‌వేర్‌తో దాడులు చేశారు. ఈ హ్యాక‌ర్స్ దాడులు చేసిన రెండు రోజుల త‌రువాత హ్య‌క‌ర్స్‌ను గుర్తించగలిగారు. దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో కంప్యూట‌ర్లు హ్యాక్ అయ్యాయ‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన హ్యాకర్లు తమకు 520 కోట్ల రూపాయ‌లు ఇవ్వాలని డిమాండ్ చేశార‌ని, ఆ సొమ్ము చెల్లిస్తే బాధితుల ఫైల్స్ డీక్రిప్ట్ అయ్యే విధంగా చూస్తామ‌ని హ్యాక‌ర్స్ ప్ర‌క‌టించినట్టు సమాచారం.

    సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ కెసయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. ఇన్ఫరేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, కెనడాతో సహా అనేక దేశాల్లో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్ సమ్ వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు FBI అధికారులు భావిస్తున్నారు. దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న రేనమ్స్ వేర్ గ్యాంగ్ ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇదీ చదవండి: బై బై జెఫ్‌ బెజోస్.. ఫ్యూచర్ ప్లాన్ ఇదే.. ఆస్థి విలువ ఎంతో తెలుసా..? అమేజాన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది?

    ఈ గ్యాంగ్ గతంలో కొన్ని మేసెజ్డ్ సర్వీ సర్వీసు ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఈసారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో జెనివాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు పాల్గొన్న సంగతి తెలిసిందే. సైబర్ దాడుల అంశం వీరిమధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడులను వీలైనంత త్వరగా అరికట్టడానికి తమతో కలిసి పనిచేయాలని పనిచేయాలని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఈ దాడులు ఇక్కడితో ఆగే పరిస్థితి లేదని అమెరికాకు హెచ్చరికలు అందుతున్నాయి.

    ఇదీ చదవండి: లైవ్ లోనే ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి.. కారణం తెలిస్తే షాక్..
    Published by:Nagesh Paina
    First published: