ఆగని ‘బ్లూవేల్’ హత్యలు... నాగ్‌పూర్‌లో మరో టీనేజ్ స్టూడెంట్ సూసైడ్...

‘బ్లూ వేల్’ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్న 17 ఏళ్ల విద్యార్థిని... అమ్మాయి చేతి మీద ‘కట్ హియర్ టు ఎక్సిట్’ (cut here to Exit) అని రాసున్న అక్షరాలను గుర్తించిన పోలీసులు..

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 7, 2018, 4:19 PM IST
ఆగని ‘బ్లూవేల్’ హత్యలు... నాగ్‌పూర్‌లో మరో టీనేజ్ స్టూడెంట్ సూసైడ్...
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని... చేతి మీద రాసుకున్న రాతలు
  • Share this:
‘బ్లూ వేల్ ఛాలెంజ్’... కొన్నాళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన మొబైల్ గేమ్. వింత వింత ఛాలెంజ్‌లు ఇస్తూ, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వశపరుచుకునే ఈ ప్రాణాంతక ఆన్‌లైన్ గేమ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నాళ్లుగా ‘బ్లూ వేల్’ గేమ్ ప్రభావం తగ్గుతుందని సంతోషిస్తున్న తరుణంలో మరో టీనేజ్ విద్యార్థిని ‘బ్లూవేల్’ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు ప్రాణాలు తీసుకుంది. నాగ్‌పూర్‌కి చెందిన ఓ విద్యార్థిని డిసెంబర్ 4న ఆత్మహత్య పాల్పడింది. ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసులకు... ఆ బలన్మరణం వెనుక ‘బ్లూ వేల్’ మహమ్మరి ఉందని విషయం తెలిసింది.

నాగ్‌పూర్‌లోని బల్‌తరోడి ఏరియాలో ఉంటున్న ఓ 17 ఏళ్ల అమ్మాయి... ఇంట్లో ఎవ్వరూ సమయంలో తన రూమ్‌లో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుకునేందుకు ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు ఆమె తల్లిదండ్రులు. అప్పుడప్పుడూ చదువుకుంటూ, ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసే ఈ అమ్మాయిని... ‘బ్లూ వేల్’ గేమ్ ఛాలెంజింగ్‌గా ఎంతగానో ఆకట్టుకుంది. అందులో సూచనల ప్రకారం ఒంటి మీద రకరకాల గుర్తులు గీసుకుని, పదాలు రాసుకున్న ఆమె... చివరి ఛాలెంజ్ పూర్తి చేసేందుకు గేమర్ సూచించినట్టుగా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మొబైల్ ఫోన్‌లో ‘బ్లూ వేల్’తో పాటు ఎన్నో ప్రమాదకర గేమ్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంటర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆ విద్యార్థిని... డిగ్రీ కాలేజ్‌ చేరేందుకు ఏడాది గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బాగా అలవాటు పడి... చదువులకి స్వస్తి పలికింది. ఇప్పుడు అదే గేమ్ కారణంగా ప్రాణం కూడా తీసుకుంది. 2015-16 ఏడాదిలో ఏకంగా 130 మంది చిన్నారులు ‘బ్లూ వేల్’ కారణంగా ప్రాణాలు తీసుకోవడం విశేషం.
First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading