Home /News /crime /

CUSTOMS SLEUTHS DETAIN 21 KG GOLD AT HYDERABAD AIRPORT CARGO SU

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో టెర్మినల్‌లో కస్టమ్స్ అధికారులు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో టెర్మినల్‌లో కస్టమ్స్ అధికారులు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన అధికారులు బంగారంతో కూడిన ఓ కొరియర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ 21 కిలోలలో.. బంగారు అభరణాలు, గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. అలాగే పట్టుబడిన కొరియర్‌లో విలువైన వజ్రాలు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆ కొరియర్ ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా అవుతుందనే వివరాలు సక్రమంగా లేనట్టుగా అధికారులు గుర్తించారు. దానిపై ఫోన్ నెంబర్ మినహా ఇతర వివరాలు లేవని అధికారులు తెలిపారు.

    దీంతో ఎవరు ఈ బంగారాన్ని తరలించాలని చూశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. కొరియర్‌పై ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Gold smuggling, Shamshabad Airport

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు