హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gold Smuggling: ‘బంగారం’లాంటి ఐడియా.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు...!!

Gold Smuggling: ‘బంగారం’లాంటి ఐడియా.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు...!!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వాలు కొత్త చట్టాలెన్ని తెచ్చినా.. కస్టమ్స్ అధికారులు నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులలో తనిఖీలు పెంచినా మోసగాళ్ల మైండ్ సెట్ లో మార్పు రావడం లేదు. ఏదో ఓ రూపంలో విదేశాల నుంచి బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాలను ప(కొ)ట్టుకొస్తూనే ఉన్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

ప్రభుత్వాలు కొత్త చట్టాలెన్ని తెచ్చినా.. భద్రతా అధికారులు తనిఖీలు పెంచినా, ఆధునిక సాంకేతికతతో మోసాలను అరికట్టడానికి యత్నిస్తున్నా.. మోసగాళ్ల మైండ్ సెట్ లో మార్పు రావడం లేదు. ఏదో ఓ రూపంలో విదేశాల నుంచి బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాలను ప(కొ)ట్టుకొస్తూనే ఉన్నారు. సినిమాల ప్రభావమో లేక.. అక్రమ బంగారమో తెలియదు గానీ.. మరీ ఈ మధ్య బంగార దొంగతనం చేసే వారి ఐడియాలు స్టార్టప్ సంస్థల ఐడియాలను తలదన్నుతున్నాయి. మొన్నీమధ్యే కేరళలో ఒక వ్యక్తి మాస్క్ లో బంగారాన్ని దాచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ లో దుబాయ్ నుంచి వచ్చని ప్రయాణీకుడు.. ఏకంగా ప్యాంటుకే ప్రత్యేకంగా ఓ జేబును చేయించుకున్నాడు. కానీ పట్టుబడ్డాడు. అసలేం జరిగిందంటే...

గురువారం దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ విమానంలో ఒక ప్రయాణికుడు అందరిలాగే సాధారణంగా నడుచుకుంటూ వస్తున్నాడు. అధికారులకు డౌట్ రావొద్దంటే ఆ మాత్రం అమాయకత్వం మెయింటెన్ చేయాలి మరి అనుకున్నాడో ఏమో గానీ.. తననెవరూ చూడటం లేదని అనుకున్నాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసినా.. బ్యాగు చూస్తారే తప్ప నేను వేసుకున్న బట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారా అనుకున్నాడు. కానీ అతడి దురదృష్టం కొద్దీ అతి సాధారణంగా వస్తున్న సదరు దొంగగారిపై కస్టమ్స్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఇంకేం లోపలికి తీసుకెళ్లారు. అక్కడ బయటపడింది అసలు విషయం.

నిందితుడు బంగారాన్ని తీసుకురావడానికి ప్యాంటు లో ప్రత్యేకంగా జేబును కుట్టించుకున్నాడు. అందులో 71.47 గ్రాముల విలువైన బంగారాన్ని దాచాడు. అంత బంగారం డైరెక్టు అలాగే పెడితే అనుమానం వస్తుందని.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో పెట్టాడు. కానీ కస్టమ్స్ అధికారులు.. జాగ్రత్తగా తనిఖీ చేసి ఆ నిగూఢ నిధిని బయటకు తీశారు. ఇది చూసిన కస్టమ్స్ అధికారులు అవక్యయ్యారు. మనోడి ఐడియా ‘బంగారం’ లా ఉన్నా.. అది బంగారాన్ని కొట్టేయడానికి వేసింది కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్ లో రూ.3.67 లక్షలకు పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

కాగా, రెండు నెలల క్రితం కేరళలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. కర్నాటకకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ వెళ్తుండగా.. తన మాస్కులో బంగారాన్ని దాచాడు. కరోనా కారణంగా అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధన ఉండటంతో సదరు వ్యక్తి.. పోలీసులు తన మాస్క్ ను చెక్ చేయలేరని భావించి.. ఎన్95 మాస్క్ లో బంగారాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డ విషయం విదితమే.

First published:

Tags: Dubai, Gold, Gold smuggling, Shamshabad, Shamshabad Airport

ఉత్తమ కథలు