ఈ సారి లోదుస్తుల్లో కాదు.. ఏకంగా పురీషనాళం నుంచే బంగారాన్ని..

Crime News : దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహ్మద్ అన్షద్ అనే ప్రయాణికుడి శరీరంలో ఏదో ఉన్నట్లు స్కానర్లు గుర్తించాయి. అతడి శరీరంలో బంగారం ఉందేమోనని అనుమానించిన పోలీసులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడి పురీష నాళం నుంచి నాలుగు గోళీలను గుర్తించారు.

news18-telugu
Updated: June 2, 2019, 7:59 AM IST
ఈ సారి లోదుస్తుల్లో కాదు.. ఏకంగా పురీషనాళం నుంచే బంగారాన్ని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగారం అక్రమ రవాణా రూటు మారుతోంది. ఒకప్పుడు వస్తువుల్లో, బ్యాగుల్లో దాచి రవాణా చేస్తుండేవారు. ఆ తర్వాత లో దుస్తుల్లో పెట్టుకొని అక్రమంగా సరఫరా చేసేవారు. ఇప్పుడు సరికొత్త పంథాను అవలంభిస్తున్నారు అక్రమార్కులు. ఏకంగా శరీరంలోపల.. పురీషనాళం నుంచి బంగారాన్ని జొప్పించి రవాణా చేస్తున్నారు. అలా అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, శంషాబాద్ విమానాశ్రయ నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహ్మద్ అన్షద్ అనే ప్రయాణికుడి శరీరంలో ఏదో ఉన్నట్లు స్కానర్లు గుర్తించాయి. అతడి శరీరంలో బంగారం ఉందేమోనని అనుమానించిన పోలీసులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడి పురీష నాళం నుంచి నాలుగు గోళీలను గుర్తించారు. వాటిని బయటకు తీసి పోలీసులకు అప్పగించారు.

వాటిని పరిశీలించిన పోలీసులు.. పేస్టు రూపంలో బంగారాన్ని దాచినట్లు తేల్చారు. మరో ఘటనలో ఓ ప్రయాణికుడు తన పురీషనాళంలో 405 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. మరో ప్రయాణికుడి వద్ద 1.5 కిలోల బరువైన నాలుగు బంగారం కడ్డీలు దొరికాయని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.

First published: June 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>