Home /News /crime /

CUSTOMS OFFICIAL PICKS UP PASSENGERS SLIPPER TO HELP HIM FINDS GOLD PASTE WORTH RS 12 LAKH HIDDEN INSIDE DETAILS HERE MS

Gold Smuggling: పాదరక్షలే పసిడికి రక్ష.. వినూత్న ఐడియాలతో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న దొంగలు

Image credits Ani/twitter

Image credits Ani/twitter

Gold Smuggling in Slippers: రోజులు మారుతున్న కొద్దీ దొంగల ఆలోచనలు కూడా మారుతున్నాయి. సాంకేతికత పెరగడంతో.. కస్టమ్స్ అధికారుల వేధింపులు ఎక్కువవుతున్నాయని అనుకుంటున్నారో ఏమో గానీ.. కొత్త తరహా దొంగతనాలతో పోలీసులే నివ్వెరపోయేలా చేస్తున్నారు దొంగలు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
    కాదేదీ కవిత్వానికనర్హం అన్నాడో కవి. దీనినే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. ఈ కాలపు దొంగలు వినూత్న రీతిలో దొంగతనాలు చేస్తున్నారు. మాస్కులు.. టోపీలు, బెల్టులు, షూ లు.. టోపీలలో ఇతర దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. వస్తువేదైనా బంగారం చోరీకి అనుగుణంగా రూపొందించుకుంటూ.. పోలీసులు సైతం నివ్వెరపోయేలా దొంగతనాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఒక వ్యక్తి ముఖానికి పెట్టుకునే మాస్కులో బంగారం తీసుకెళ్తుండగా పట్టుబడగా.. ఇటీవలే హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఒక మోసగాడు జీన్స్ పాయింట్ లో ప్రత్యేక జేబు కుట్టించుకుని మరీ బంగారాన్ని తీసుకొచ్చాడు. ఇక తాజాగా.. చెన్నైలో ఒక స్మగ్లర్.. ఏకంగా పాదరక్షలలోనే పసిడిని దాచాడు.

    వివరాల్లోకెళ్తే.. తమిళనాడు లోని రామనాథపురానికి చెందిన మహ్మద్ హసన్ అలి సౌదీ అరేభియా నుంచి వచ్చాడు. సోమవారం అతడు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు. సాదాసీదా వ్యక్తి లాగా ఉన్న హసన్.. చెప్పులేసుకుని విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెళ్తున్న హసన్ చెప్పు ఉన్నట్టుండి ఊడిపోయింది. అక్కడే ఉన్న ఎయిర్ పోర్టు సిబ్బంది దీనిని గమనించి.. ఆ చెప్పును అతడికి అందజేయబోయాడు.
    కానీ అతడికి ఏదో అనుమానం వచ్చింది. హసన్ వేసుకున్న తోలు చెప్పులు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అతడు హసన్ ను ఆపి.. రెండు చెప్పులు చూడగా అవి బరువుగా అనిపించాయి. దీంతో వెంటనే అతడు కస్టమ్స్ అధికారులకు సమాచారమందించాడు.





    సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు.. ఆ చెప్పులను పరీక్షించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాటిని కోస్తుండగా... అందులో నాలుగు ఎర్రటి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అందులో ఒక్కోటిదాన్ని తీసి చూశారు. మొత్తం నాలుగు కవర్లలో 239 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ. 12 లక్షలదాకా ఉంటుందని అధికారులు తెలిపారు.





    బంగారంతో పాటు రూ. 6.5 లక్షల విలువైన సొమ్ము కూడా ఆ చెప్పులలోనే లభ్యమైంది. బంగారం, నగదును స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Airport, Chennai, Gold, Gold smuggling, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు