Gold: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం...

షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఏకంగా 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం బరువు మొత్తం మూడు కిలోలు ఉండగా, ఈ 26 బంగారు బిస్కెట్ల విలువ దాదాపు రూ.1.11 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

news18-telugu
Updated: August 25, 2019, 7:16 PM IST
Gold: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున్న స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు విధుల్లో భాగంగా ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా, షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఏకంగా 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం బరువు మొత్తం మూడు కిలోలు ఉండగా, ఈ 26 బంగారు బిస్కెట్ల విలువ దాదాపు రూ.1.11 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. కాగా నిందితుడిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరచూ బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులకు ఒక సవాలుగా మారింది.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు