మొబైల్ కొనుగోలుకు లోన్ అని నమ్మించి.. పర్సనల్‌ లోన్ తీసుకున్న మోసగాళ్లు.. కస్టమర్లు జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

సెల్‌ఫోన్ సొంతం చేసుకోవడానికి రుణ వడ్డీతో సహా రూ. 2,374 చొప్పున ఆరు వాయిదాలు చెల్లించాలని విజయ్ కి ముగ్గురు మోసగాళ్లు చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్ లోన్ కోసం ధ్రువపత్రాలు తీసుకున్నారు. గంటన్నరపాటు తమ వద్దే సెల్‌ఫోన్‌ను ఉంచుకుని కొన్ని బ్యాంకింగ్ లావాదేవీలు కూడా జరిపారు.

  • Share this:
ప్రస్తుతం ఎక్కడ చూసినా సైబర్ నేరాలు, ఈజీ మనీ మోసాలే వెలుగు చూస్తున్నాయి. ప్రజలను నమ్మించి బురిడీ కొట్టించడానికి మోసగాళ్లు కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో వెలుగుచూసిన ఒక మోసం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. గాంధీనగర్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తిని ముగ్గురు కేటుగాళ్లు చాలా తెలివిగా మోసం చేశారు. బాధితుడికి సంబంధించిన బ్యాంకు పత్రాలను ఉపయోగించి.. అతడికి తెలియకుండానే రూ.48,000 వ్యక్తిగత రుణం తీసుకున్నారు. దీని గురించి ఆలస్యంగా తెలుసుకున్న సదరు బాధితుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించి మోసగాళ్లపై ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్‌లోని ఆదివాడ గ్రామానికి చెందిన విజయ్ దంతాని అనే వ్యక్తి.. జులై, 2020న ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి సెక్టార్-16 ప్రాంతంలోని ఒక దుకాణానికి వెళ్లాడు. అక్కడ చేతన్ రజావత్, అబ్దుల్ ఖురేషి, రజనీకాంత్ వోరా అనే ముగ్గురిని కలుసుకున్నాడు. వారు చూపించిన ఒక స్మార్ట్‌పోన్‌ను విజయ్ ఇష్టపడ్డాడు. దాని ధర దాదాపు రూ.18,300 గా ఉంది. అయితే ఆ ఫోన్‌ను లోన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చని విజయ్ కి వారు చెప్పారు. దీంతో రూ.5000 డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం సెల్‌ఫోన్ సొంతం చేసుకోవడానికి రుణ వడ్డీతో సహా రూ. 2,374 చొప్పున ఆరు వాయిదాలు చెల్లించాలని విజయ్ కి ముగ్గురు మోసగాళ్లు చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్ లోన్ కోసం ధ్రువపత్రాలు తీసుకున్నారు. గంటన్నరపాటు తమ వద్దే సెల్‌ఫోన్‌ను ఉంచుకుని కొన్ని బ్యాంకింగ్ లావాదేవీలు కూడా జరిపారు.

నెల రోజుల తర్వాత.. అంటే సెప్టెంబర్‌, 2020లో ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు సంబంధించిన ఇద్దరు రికవరీ ఏజెంట్లు విజయ్ ఇంటికి వచ్చారు. పర్సనల్ లోన్‌పై చెల్లించని రూ.14,244 తిరిగి చెల్లించాల్సి కోరారు. దాంతో షాక్ అయిన విజయ్.. తాను ఎలాంటి పర్సనల్ లోన్ తీసుకోలేదని బదులిచ్చాడు. కానీ అతడి మాటలను బ్యాంకు ఏజెంట్లు పట్టించుకోలేదు. పర్సనల్ లోన్ తీసుకున్నారని.. మిగిలిపోయిన వాయిదాలను తక్షణమే చెల్లించాలని హెచ్చరించారు. తనకు లోన్‌తో ఎలాంటి సంబంధం లేదని విజయ్ వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

K Chandrashekar Rao: ఒకే నెలలో రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. గులాబీ బాస్ లెక్కేంటి ?

JC Diwakar Reddy: జేసీ దివాకర్‌రెడ్డికి కాంగ్రెస్ నేత వార్నింగ్.. ఇకపై అలా చేయొద్దంటూ..

దాంతో చేసేది లేక అతను ప్రహ్లాద్‌నగర్‌లోని ప్రైవేట్ బ్యాంక్ ప్రధాన శాఖ అధికారులను ఆశ్రయించాడు. పర్సనల్ లోన్ గురించి అడిగి తెలుసుకోగా.. అతని పేరు మీద సుమారు రూ.48,000 వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు తెలిసింది. దాంతో అతను పోలీసులను సంప్రదించాడు. పోలీసుల విచారణలో రాజావత్, ఖురేషి, వోరా.. విజయ్ పేరు మీద పర్సనల్ లోన్ తీసుకున్నారని తేలింది. ఈ మోసం గురించి తెలుసుకున్న బాధితుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు సెక్టార్-21 పోలీసులు ఆ ముగ్గురిపై మోసం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published by:Kishore Akkaladevi
First published: