Currency Notes: ముళ్ల పొదల్లో నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయి..?

రోజులు మారుతున్న కొద్దీ దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పని విధానాన్ని మార్చుకుంటున్నారు. దోచుకున్న సొమ్మును ఇండ్లలో దాయడం పాత పద్దతే కదా..

news18
Updated: October 9, 2020, 2:25 PM IST
Currency Notes: ముళ్ల పొదల్లో నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయి..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 9, 2020, 2:25 PM IST
  • Share this:
రోజులు మారుతున్న కొద్దీ దొంగతనం చేసే వారు కూడా అప్డేట్ అవుతున్నారు. స్థానికంగానో లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ లోనో వారి మీద కేసు నమోదై ఉంటుంది గనుక.. తరుచుగా వారు ఉంటున్న ఇండ్లలో గానీ, తెలిసిన వారి ఇండ్లలో డబ్బును దాచే పద్దతికి చెల్లుచీటి పాడుతున్నారు. దాచుకున్న మొత్తాన్ని అడవుల్లోనో.. వేరే చోటో దాస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్నాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు డబ్బులను ఒక వ్యవసాయ భూమిలోని ముళ్ల పొదల్లో దాయడం గమనార్హం.

వివరాల్లోకెళ్తే... కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకాలోని బుక్లోరహల్లి వద్ద ఉన్న ఒక వ్యవసాయ భూమిలోని ముళ్లపొదల్లో రూ. 36 లక్షలు విలువ చేసే నోట్ట కట్టలు పడున్నాయి. ఇవి రూ. 50, రూ. 100, రూ. 2000 విలువతో ఉన్న నోట్ల కట్టలు. కొన్ని రోజుల క్రితం ఇదే గ్రామానికి సమీపంలో ఉన్్న దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ కార్యాలయం నుంచి దొంగలు రూ. 36 లక్షలు దొంగతనం చేశారు. నిర్మాణ రంగానికి చెందిన ఈ కంపెనీ.. బీదర్-శ్రీరంగపట్నం జాతీయ రహదారి పనులను చేస్తున్నది. కాగా, బుక్లోరహల్లి వద్ద ఉన్న వీరి కార్యాలయం నుంచి గుర్తు తెలియని దొంగలు.. ఆ సొమ్ము దొంగిలించారు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసుల బృందం.. స్నిపర్ డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిన్ నిపుణులను పిలిపించారు. వారితో దర్యాప్తు చేపట్టగా.. స్నిపర్ డాగ్ లు డబ్బు ఉన్న చోటును గుర్తించాయి. సొమ్ము కాజేసిన దొంగలే.. దొంగిలించిన సొమ్మును ఇక్కడ దాచి పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనలో దొంగలెవరో గుర్తించే పనిలో ఉన్నారు.
Published by: Srinivas Munigala
First published: October 9, 2020, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading