Home /News /crime /

CUNNING HUSBAND GIVING SOME TEA TO THE WIFE AND TRY TO KILL HER MIXED POISON IN THE TEA SSR

Husband Giving Tea: భార్యకు టీ పెట్టి ఇచ్చిన భర్త.. అంత ప్రేమగా ఇచ్చాడని తాగితే ఏమైందో చూడండి..

బాధితురాలు

బాధితురాలు

భార్యాభర్తల బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు సహజం. భార్య అలకలు, భర్త బుజ్జగింపులు సర్వ సాధారణం. కానీ.. ఆలుమగల మధ్య అనుమానం తలెత్తితే మాత్రం కాపురంలో కలతలు మొదలయినట్టే. ఏ ఒక్కరిలో అనుమానం మొదలైనా అది పెను భూతంగా మారి సంసారాన్ని చిక్కుల్లోకి నెట్టేస్తుంది.

ఇంకా చదవండి ...
    నలంద: భార్యాభర్తల బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు సహజం. భార్య అలకలు, భర్త బుజ్జగింపులు సర్వ సాధారణం. కానీ.. ఆలుమగల మధ్య అనుమానం తలెత్తితే మాత్రం కాపురంలో కలతలు మొదలయినట్టే. ఏ ఒక్కరిలో అనుమానం మొదలైనా అది పెను భూతంగా మారి సంసారాన్ని చిక్కుల్లోకి నెట్టేస్తుంది. భార్యాభర్తల బంధానికి పునాదే నమ్మకం. ఆ నమ్మకం కోల్పోయి ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితి వస్తే ఆ కాపురం నరకమే. బీహార్‌లోని నలంద జిల్లాలో ఓ భర్త ప్రవర్తించిన తీరు అనుమానపు దుష్ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతోంది. వివరాల్లోకి వెళితే... సోహ్‌సరై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆషా నగర్ సొసైటీలో పాశ్వాన్, సులేఖా దేవి అనే దంపతులు ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. పాశ్వాన్ టెంపో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే.. తన భార్యపై పాశ్వాన్‌కు అనుమానం మొదలైంది. తాను ఇంట్లో లేని సమయంలో మరొకరితో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భావించేవాడు. భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక సులేఖా దేవి గత ఏడాది కాలంగా పుట్టింట్లోనే ఉంటోంది.

    అయితే.. ఇటీవల తన ప్రవర్తన మార్చుకుంటానని, ఇకపై మంచిగా ఉంటానని.. ఇబ్బంది పెట్టనని చెప్పడంతో సులేఖా దేవి భర్తతో పాటు తిరిగి వచ్చి ఉంటోంది. పూర్తిగా మారిపోయినట్టు పాశ్వాన్ భార్యను నమ్మించాడు. వచ్చినప్పటి నుంచి భార్య అడగకుండానే పనిలో సాయం చేయడం, ఇంట్లో పనుల్లో భాగమవ్వడం చేస్తున్నాడు. తన భర్త మారిపోయాడని సులేఖా దేవి భావించింది. తన భర్త టీ తీసుకొచ్చి ఇస్తే ఆ టీ తాగింది. కానీ.. టీ తాగి బయటకు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. కడుపు నొప్పి తగ్గేందుకు మాత్ర మింగినా ఫలితం లేకపోవడంతో భర్త తనకు ఇచ్చిన టీలో ఏదో కలిపాడని సులేఖ గ్రహించింది. నేరుగా అతి కష్టం మీద పోలీస్ స్టేషన్‌కు కడుపు నొప్పితో బాధపడుతూ చేరుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఆమె వాంతులు చేసుకుని స్పృహ తప్పిపడిపోయింది.

    ఇది కూడా చదవండి: Female Constable: ఎంత పనిచేసింది... భార్య కోసం స్టేషన్‌కు భోజనం తీసుకెళ్లిన భర్త.. అప్పుడు తెలిసింది అసలు సంగతి..

    దీంతో.. మహిళా ఠాణా పోలీసులు వెంటనే ఆమెను సదర్ హాస్పిటల్‌కు తరలించారు. తన భర్త ఇచ్చిన టీ తాగిన తర్వాత నుంచి తనకు ఇలా కడుపు నొప్పి మొదలైందని.. తన ఆరోగ్యం క్షీణించిందని ఆమె పోలీసులకు చెప్పింది. సులేఖా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం పవపురికి తరలించారు. ఫిర్యాదు చేసేందుకు ఆమె స్టేషన్‌కు వచ్చిందని.. కానీ వచ్చిన కొంతసేపటికే ఆమె వాంతులు చేసుకుంటూ కిందపడిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం.. ఆమె భర్త కనిపించకుండా పోయాడు. పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆమె తాగిన టీలో విషం కలిసినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్యపై అనుమానంతోనే పాశ్వాన్ ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Husband, Husband harassment, Illict affair suspicion, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు