హోమ్ /వార్తలు /క్రైమ్ /

Munmun Dhamecha: శానిటరీ ప్యాడ్‌లో డ్రగ్స్ దాచి తీసుకెళ్లిన మున్మున్ ధమేచా!.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Munmun Dhamecha: శానిటరీ ప్యాడ్‌లో డ్రగ్స్ దాచి తీసుకెళ్లిన మున్మున్ ధమేచా!.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

(ఫోటో @munmundhamecha/instagram)

(ఫోటో @munmundhamecha/instagram)

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో (Cruise Drugs Case) కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ ఆ షిప్ లోకి తీసుకువెళ్ళడానికి రకరకాల మార్గాలను ఎంచుకున్నారు.

  ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో (Cruise Drugs Case) కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ ఆ షిప్ లోకి తీసుకువెళ్ళడానికి రకరకాల మార్గాలను ఎంచుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అధికారులు పలు ఆసక్తికర విషయాలను కనుగొంటున్నారు. షిప్‌లోకి ఓ మహిళ.. డ్రగ్స్‌ను తన శానిటరీ ప్యాడ్‌లలో దాచి తీసుకెళ్లిందని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. శానిటరీ న్యాప్‌కిన్‌లో దాచి ఉంచడం ద్వారా నౌకకు డ్రగ్స్ తీసుకెళ్లినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం వెల్లడించింది. పిల్స్​ రూపంలో ఉన్న ఈ డ్రగ్స్​ను ఎన్​సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయబడిన మున్మున్ ధమేచా (Munmun Dhamecha) రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు చెప్పారు. ఆమె శానిటరీ నాప్‌కిన్స్‌లో డ్రగ్స్ దాచిందని వారు అంటున్నారు. ఇలా రకరకాల ‌డ్రగ్స్‌ను నిందితులు షిష్‌లోకి చేర్చారని ఎన్సీబీ చెబుతోంది. ఇక, ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

  ఇక, గత శనివారం ముంబై నుంచి గోవా వెళ్తున్న కార్డెలియా క్రూయిజ్‌ షిప్‌పై అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులు.. దాడులు చేపట్టారు. ముంబై సముద్ర తీరం నుంచి బయలుదేరిన క్రూయిజ్ షిప్‌లోకి ఎన్​సీబీ అధికారులు.. తమని తాము ప్యాసింజర్లుగా పరిచయం చేసుకొని ప్రవేశించారు. ముంబై నుంచి బయలుదేరిన తర్వాత సముద్రం మధ్యలో పార్టీ ప్రారంభమైందని.. ఆ సమయంలో తాము దాడులు చేసినట్టుగా అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పలువురుని అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేశారు.

  TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. దసరా పండుగ బస్సుల్లో ఆ చార్జీలు ఎత్తివేత..

  క్రూయిజ్‌ షిప్‌లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టుగా తమకు సమాచారం ఉందని ఎన్సీబీ అధికారలు తెలిపారు. ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 టాబ్లెట్ల MDMA, 5గ్రాముల MD మరియు రూ .1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులు ఇప్పటివరకు మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన పలువురి బెయిల్ పిటిషన్‌‌లను కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bollywood, Drugs case

  ఉత్తమ కథలు