కూతుర్ని పదేళ్లు రేప్ చేసిన తండ్రి... భార్యతో ఏమన్నాడంటే...

Brisbane, Australia : బాధితురాలు చెప్పిన మాటలు విని ఆస్ట్రేలియా పోలీసులు షాకయ్యారు. తమ దేశంలో ఓ మహిళకు ఇంత అన్యాయం జరగడంపై ఆశ్చర్యం కలిగింది వారికి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 10:39 AM IST
కూతుర్ని పదేళ్లు రేప్ చేసిన తండ్రి... భార్యతో ఏమన్నాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
1970 నుంచీ 1980 మధ్య జరిగిందీ తంతు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన భార్య ఆస్పత్రిలో ఉండగా... ఐదేళ్ల కూతురిపై కన్నేశాడు ఆ తండ్రి. ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే, నిన్నూ, అమ్మనూ చంపేస్తానని ఆ పిల్లను బెదిరించాడు. ఇలా ఒకసారి కాదు... పదేళ్ల కాలంలో... దాదాపు 11 సార్లు ఆమెను రేప్ చేశాడు. ఆ చిన్నారికి ఐదేళ్ల నుంచీ 15 ఏళ్లు వచ్చేవరకూ ఈ ఘోరం కొనసాగింది. ఆ పదేళ్లలో ఎప్పుడూ ఆమె తనపై జరుగుతున్న అరాచకం గురించి తల్లికి చెప్పలేదు. చెబితే, తననూ, తన తల్లినీ తండ్రి చంపేస్తాడేమోనన్న భయం ఆమెను చెప్పనివ్వలేదు. పదేళ్ల తర్వాత ఓ రోజు కూతుర్ని రేప్ చేస్తుండగా... తల్లి చూసింది. ఏంటీ దారుణం అని అడిగింది. ఏం చెయ్యమంటావ్... నీతో నాకు సంతృప్తి కలగట్లేదు. నీ కంటే తనే బాగుంది అన్నాడు. కూతుర్ని చూస్తూ... ఎలా కోపరేట్ చెయ్యాలో నీ తల్లికి నేర్పించు అన్నాడు. షాకవ్వడం వాళ్లిద్దరి వంతైంది.

ఇదంతా జరిగిన 30 ఏళ్ల తర్వాత... అంటే... 2014లో తల్లి చనిపోయిన తర్వాత... 51 ఏళ్ల వయసున్న బాధితురాలు... పోలీసులకు తన తండ్రిపై కంప్లైంట్ ఇచ్చింది. తన తండ్రికి ఉన్న ఆరుగురు సంతానంలో తాను రెండో దానినని చెప్పిన బాధితురాలు... తన తండ్రి వల్ల తనకు జీవితంపైనే విరక్తి వచ్చిందని వివరించింది. ఎన్నో కష్టాలు పడ్డాననీ, ఏడ్చిన ఏడుపులకు లెక్కలేదనీ తెలిపింది. నిరంతరం టెన్షన్, డిప్రెషన్, గతాన్ని తలచుకుంటూ బాధపడటమే తప్ప వేరే జీవితం తనకు లేదంది. తనకు వచ్చినన్ని పీడకలలు మరెవరికీ రాకపోవచ్చని కన్నీళ్లు పెట్టింది.

బాధితురాలి తండ్రిని జైలుకు పంపిన కోర్టు... బాధితురాలికి రూ.4,68,77,444 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

 

ఇవి కూడా చదవండి :

తెలంగాణలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... 12 గంటలపాటూ చిత్రహింసలు...

అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారు... తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ హాసన్పాకిస్థాన్ యువతి ఉచ్చులో భారత జవాన్‌... కొంపముంచిందిగా...

ఎల్ఈడీ బల్బులతో ప్రమాదం... కళ్లుపోతాయ్..!!
First published: May 17, 2019, 10:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading