ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama krishnam Raju) నివాసం వద్ద జరిగిన రెక్కీ వ్యవహారంలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురామ (RRR)తో పాటు ఆయన భద్రతా సిబ్బంది (Security Officials) చెబుతున్నారు. అయితే రోడ్డు పక్కన ఉన్న తనను కారులో బలవంతంగా తీసుకు వెళ్లి, దాడి చేశారని ఏపీ ఇంటెలిజన్స్ కానిస్టేబుల్ (AP Intelligence Constable) ఫరూక్ భాషా చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
నోయిడా 221 బెటాలియన్..
ఈ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న కానిస్టేబుల్ ఫరూక్ భాషాను భద్రతా సిబ్బంది బలవంతంగా కారులో తీసుకు వెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ ఇద్దరు సీఆర్ పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకు భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ గంగారాంతోపాటు కానిస్టేబుల్ సందీప్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు, ఆయన కుమారుడిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ గంగారాం, కానిస్టేబుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సురేష్ వెల్లడించారు.
అసలేం జరిగింది?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi) పర్యటన సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లో విధి నిర్వహణలో ఉన్న తనపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా తెలిపాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న తనపై దాడి చేసి, కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కొందరు సీఆర్‌పీఎఫ్ (CRPF) కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు చెప్పాడు. తన ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని తెలిపాడు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు తెలిపాడు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు తనను అప్పగించినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో ఉన్న ఎంపీ నివాసానికి ఇది దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందని బాధితుడు చెప్పడం గమనర్హం.
సీసీటీవీలో వ్యక్తి కదలికలను గుర్తించి..
అయితే రఘురామ (RRR) సిబ్బంది వాదన మరోలా ఉంది. అయితే రఘురామ ఇంటిదగ్గర జూలై 4న ఉదయం రెక్కీ నిర్వహించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడని ఆయనను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాలని రఘురామరాజు తెలిపారు. సీసీటీవీలో వ్యక్తి కదలికలను గుర్తించిన సిబ్బంది... ఐడి కార్డు తీసుకుని ఆరాతీస్తే ఏపీకి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ pc భాషగా తేలిందని రఘురామ తెలిపారు. 12 మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తన ఇంటి వద్ద కాపుకాసి అని తన వాహనాన్ని వెల్లడించారని పోలీసు అధికారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే మంగళవారం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ గచ్చిబౌలి లో పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Case filed, Crime news, MP raghurama krishnam raju, RRR