Home /News /crime /

CRPF JAWAN KILLED ANOTHER INJURED IN TERRORIST ATTACK IN SRINAGAR MAISUMA HOURS AFTER PULWAMA NON LOCALS SHOT MKS

Jammu Kashmir: శ్రీనగర్‌లో ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి.. పుల్వామాలో కూలీలపై కాల్పులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగుతున్నారు. గంటల వ్యవధిలోనే షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయక్కడ. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. వివరాలివే..

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగుతున్నారు. గంటల వ్యవధిలోనే షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయక్కడ. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతాబలగాలను, స్థానికేతర కూలీలను టార్గెట్ చేసుకుని మారణహోమానికి యత్నించారు. జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం చెప్పిన వివరాలివి...

పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. పుల్వామా జిల్లాలో లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతోన్న వ్యక్తులను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్‌గా గుర్తించినట్లు జమ్ముకాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే శ్రీనగర్ లో మరో ఉగ్రదాడి జరిగింది..

Zodiac Signs: కిటికీ లేని గదిలో ఏ రాశివారు ఏం చేస్తారో తెలుసా? మీ రియాక్షన్ చెక్ చేసుకోండి


శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఓ సీఆర్పీఎఫ్ జ‌వాను మృతిచెందాడు. మ‌రో జ‌వాను గాయ‌ప‌డ్డాడు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను స‌మీపంలోని ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. భ‌ద్ర‌తా ద‌ళాల చెక్ పాయింట్ వ‌ద్ద ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. దాడి చేసిన త‌ర్వాత ఉగ్ర‌వాదులు పారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని సీజ్ చేశారు. సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు.

Jammu Kashmir: స్థానికేతర కూలీలపై ఉగ్రవాదుల కాల్పులు -Pulwamaలో తాజా ఘటన


శ్రీనగర్ ఉగ్రదాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోవడం, మరొకరికిగాయమైన ఘటన తర్వాత పుల్వామాలో మళ్లీ కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. పుల్వామాలో ఇద్ద‌రు వ‌ల‌స కూలీల‌పై కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌డం శోచ‌నీయం. వ‌రుస‌గా రెండ‌వ రోజు బీహారీ కూలీల‌పై కాల్పులు జ‌రిగాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Attack, CRPF, Jammu kashmir, Srinagar, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు