ములుగు జిల్లా (Mulugu district)లో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. వెంకటాపురం పోలీస్ స్టేషన్ (Venkatapuram Police Station)లో జవాన్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం కాల్పులకు (Firing) దారితీసింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెస్ వద్ద సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన ఎస్ఐ ఉమేశ్ చంద్రపై సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ (CRPF Head Constable Stephen) మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.
తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం..
తీవ్ర గాయాలతో ఎస్ఐ అక్కడికక్కడే మృతి (Died) చెందగా.. భయాందోళనకు గురైన స్టీఫెన్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం (Fired himself) చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలవగా హుటాహుటిన అతన్ని ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. స్టీఫెన్ గదవ, తలకు బుల్లెట్ గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం (Warangal MGM)కు తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మృతి చెందిన ఎస్సైది బిహార్ (Bihar), కాగా కానిస్టేబుల్ స్టీఫెన్‌ది తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) ప్రాంతం.
సెంట్రీ డ్యూటీ ఎప్పుడూ నాకే వేస్తావా అంటూ..
తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దులోని వెంకటాపురం పీఎస్ పరిధిలో సీఆర్పీఎఫ్కు చెందిన 39వ బెటాలియన్ (39th Battalion of the CRPF) గత కొంత కాలంగా పనిచేస్తుంది. అయితే ఎస్ఐ ఉమేశ్ చంద్రకు, కానిస్టేబుల్ స్టీఫెన్‌కు వాగ్వివాదం (Conflict) చోటుచేసుకుంది. సెంట్రీ డ్యూటీ ఎప్పుడూ నాకే వేస్తావా అంటూ ఎస్సైతో స్టీఫెన్ గొడవ పడ్డాడు.
ఈ గొడవ పెరిగి పెద్దది కావడంతో క్షణికావేశంలో ఎస్సై ఉమేశ్ చంద్రపై సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్టీఫెన్ కాల్పులు (Firing) జరిపాడు. ఎస్సై ఛాతిలో రెండు బుల్లెట్లు, పొట్టలో ఒక బులెట్ మొత్తం మూడు రౌండ్లు కాల్పులు (Three rounds of fire) జరిపాడు. అనంతరం భయాందోళనకు గురైన స్టీఫెన్ అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పక్కనే ఉన్న జవాన్లు రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ సీఆర్పిఎఫ్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్రపై కాల్పులు జరిపారని, అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్సై ఉమేష్ చంద్ర మృతిచెందగా హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ చేసి పూర్తి వివరాలు తెలుపుతామని ఎస్పీ అన్నారు. పని ఒత్తిడి వల్ల ఏర్పడిన మనస్పర్థలతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల నక్సల్స్ కోసం అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు, బందోబస్తు నిర్వహించే క్రమంలో పనిభారం పెరిగి, మనస్పర్థలు వచ్చుంటాయని పోలీసులు భావిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.