హోమ్ /వార్తలు /క్రైమ్ /

గోనెసంచి నిండా నగలు.. 7 నిమిషాల్లో కోటిన్నర చోరీ.. వీళ్ల కన్ను పడితే సర్వం స్వాహా..

గోనెసంచి నిండా నగలు.. 7 నిమిషాల్లో కోటిన్నర చోరీ.. వీళ్ల కన్ను పడితే సర్వం స్వాహా..

గత 30 ఏళ్ల నగరంలో జరిగిన అతిపెద్ద దోపిడీ ఇదే. ఈ ఘటన మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. 1990వ దశకంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఆ తర్వాత నగరంలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదు.

గత 30 ఏళ్ల నగరంలో జరిగిన అతిపెద్ద దోపిడీ ఇదే. ఈ ఘటన మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. 1990వ దశకంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఆ తర్వాత నగరంలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదు.

గత 30 ఏళ్ల నగరంలో జరిగిన అతిపెద్ద దోపిడీ ఇదే. ఈ ఘటన మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. 1990వ దశకంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఆ తర్వాత నగరంలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదు.

  దొంగతనాల కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. .దొంగల ముఠా ముఖానికి ముసుగులు ధరించి.. చేతిలో తుపాకులు పట్టుకొని.. సిబ్బందిని బెదిరిస్తారు. ఆ తర్వాత అందినకాడికి నగదును, ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకొని .. అక్కడి పారిపోతున్నారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపుల్లో చోరీలకు సంబంధించిన సీన్స్‌ను చాలా మూవీల్లోనే చూశాం. ఇప్పటికే అలాగే ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి. పట్ట పగలే.. అందరూ చూస్తుండగానే.. దర్జాగా దొంగతనాలు చేస్తున్నారు కేటుగాళ్లు. సీసీ కెమెరాలున్నా... పోలీసులు గస్తీ కాస్తున్నా..డోంట్ కేర్.. ! పక్కా స్కెచ్‌తో.. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో.. కోట్లు కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా బీహార్‌లోని ఛప్రా నగరంలో భారీ దోపిడీ జరిగింది. ఓ దొంగల ముఠా జ్యువెలరీ షాపులోకి చొరబడి కోటిన్నరకు పైగా విలువైన బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం చంప్రా నగరంలోని పీఎన్ జ్యువెల్లర్స్‌లో దొంగలు పడ్డారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలను మొత్తం ఎత్తుకెళ్లారు. మొత్తం ఆరుగరు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. వారి ముఖాలను ముసుగులు ధరించి ఉన్నాయి. గుర్తు పట్టడానికి విల్లేకుండా చేతులకు గ్లౌస్‌లు, కాళ్లకు సాక్స్‌లు, ముఖానికి మాస్క్‌లు ధరించి ఉన్నారు. ముందుగా సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి.. అతడి వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నారు. అనంతరం షాపులోకి వచ్చి.. గాల్లోకి కాల్పులు జరిపారు. కదిలితే చంపేస్తామని సిబ్బందిని బెదిరించారు. అనంతరం గన్నుతో డిస్‌ప్లే బోర్డును బద్దలు కొట్టి.. అందులో ఉన్న బంగారం ఆభరణాలన్నింటినీ ఓ గోనె సంచిలో వేసుకున్నారు. అంతేకాదు సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా కట్టేశారు. ఐతే ఓ ఉద్యోగిని బిగ్గరగా ఏడవడంతో ఆమెకు ఫోన్ తిరిగిచ్చారు. కానీ ఎవరికీ కాల్ చేసేందుకు వీలు లేకుండా.. సిమ్ కార్డు తీసుకున్నారు. ఖాళీ మొబైల్ మాత్రమే అప్పగించారు. అనంతరం సిబ్బందికి టాటా బై బై చెబుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా జస్ట్ 7 నిమిషాల్లోనే పూర్తయింది.

  Rape On Child : స్వీట్స్ ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి..5ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

  దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చారు. పీఎన్ జ్యుయెల్లర్స్ యజమానికి సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు జ్యువెలరీ షాప్‌కు వెళ్లి పరిశీలించారు. యజమాని నాగేంద్రప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నగల దుకాణం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి. ఐతే వారి ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉండడంతో గుర్తు పట్టడం కష్టంగా మారింది. వేలి ముద్రలు కూడా పడకుండా ఉండేందుకు.. చేతులకు కూడా గ్లౌజ్‌లు ధరించినట్లు పోలీసులు వెల్లడించారు. వారు ఛప్రా నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లే అవకాశం ఉండడందో.. ఆయా జిల్లాల ఎస్పీలను పోలీసులు అలర్ట్ చేశారు.

  కొంప ముంచిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్.. వరుడి స్నేహితులపై కేసు.. అసలేం జరిగిందంటే

  ఆరుగురు దొంగలు నడుచుకుంటూనే షాప్‌కు వచ్చారని.. చోరీ అనంతరం నడుచుకుంటూనే వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. షాప్‌కు కొద్ది దూరంలో వాహనాన్ని పార్క్ చేసి ఉండవచ్చని.. సీసీ కెమెరాల్లో వాహనం దృశ్యాలు రికార్డవ్వకుండా జాగ్రత్త పడి ఉంటారని వెల్లడించారు. చోరీ అనంతరం తిరిగి అదే వాహనంలో పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గత 30 ఏళ్ల నగరంలో జరిగిన అతిపెద్ద దోపిడీ ఇదే. ఈ ఘటన మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. 1990వ దశకంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఆ తర్వాత నగరంలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదని.. ఈ క్రమంలో వ్యాపారులు ఉలిక్కిపడ్డారని జెమ్స్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వరుణ్ ప్రకాశ్ పేర్కొన్నారు.

  First published:

  Tags: Bihar, Crime, Gold, Gold robbery, Robbery

  ఉత్తమ కథలు