దొంగ 20 వేలు అన్నాడు.. పోలీసులు 10 వేలు అన్నారు.. 15 వేలకి బేరం కుదిరింది..

తన వాంటెడ్ పోస్టర్‌కి ఫేస్‌బుక్‌లో 15వేల లైకులు వచ్చినట్లయితే తానే టొర్రింగ్టన్ పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. ముందు అతడు 20 వేల లైక్స్ అన్నాడు.. కానీ, అన్నీ లైక్స్ అయితే కష్టం 10వేల అయితే ఓకే అనడంతో.. నీ మాట కాదు.. నా మాట కాదు.. 15 వేల లైక్స్‌కి డీల్ ఓకే అంటూ ఒప్పందం కుదిరింది’

news18-telugu
Updated: May 25, 2019, 5:13 PM IST
దొంగ 20 వేలు అన్నాడు.. పోలీసులు 10 వేలు అన్నారు.. 15 వేలకి బేరం కుదిరింది..
దొంగ వింత కోరిక
news18-telugu
Updated: May 25, 2019, 5:13 PM IST
కొన్ని కేసులు మరీ విచిత్రంగా ఉంటాయి. వాటి గురించి తెలిసినప్పుడు నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కాదు.. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. అక్కడ టొర్రింగ్టన్ పోలీసులు గత కొన్నేళ్లుగా జోస్ సిమ్స్(29) అనే నేరగాడి కోసం వెతుకుతున్నారు. అతనిపై రెండు అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. దీంతో.. ఇతని కోసం పోలీసులు ప్రచురించిన వాంటెడ్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో రాసిన క్యాప్షన్ ఏంటంటే..‘జోస్ సిమ్స్ గత వారం నాతో ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడాడు. తన వాంటెడ్ పోస్టర్‌కి ఫేస్‌బుక్‌లో 15వేల లైకులు వచ్చినట్లయితే తానే టొర్రింగ్టన్ పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. ముందు అతడు 20 వేల లైక్స్ అన్నాడు.. కానీ, అన్నీ లైక్స్ అయితే కష్టం 10వేల అయితే ఓకే అనడంతో.. నీ మాట కాదు.. నా మాట కాదు.. 15 వేల లైక్స్‌కి డీల్ ఓకే అంటూ ఒప్పందం కుదిరింది’ అని పోలీస్ అధికారి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

ఈ పోస్టుని చూసినవారంతా తమవంతు సాయంగా లైక్స్ చేశారు. దీంతో తక్కువ సమయంలోనే 25వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కానీ, జోస్ సిమ్స్ మాత్రం పోలీసులకు లొంగిపోలేదు. దీంతో.. మరో వార్త కూడా ఊపందుకుంది.. దొంగను పట్టుకునేందుకే పోలీసులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏదేమైనా నిజం నిలకడ తెలుస్తుందని మరికొంతమంది వెయిట్ చేస్తున్నారు.

First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...