Crime: ఈ ఫోటోని మహిళను జాలేస్తోందా ? ఈమె ఎంతో ఖతర్నాక్.. ఏం చేసిందంటే..

పోలీసుల అదుపులో ఉన్న మహిళ

మసౌది పోలీస్ స్టేషన్‌కు హడావిడిగా వచ్చిన ఈ మహిళ.. తన భర్తపై ఎవరో హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేసింది.

  • Share this:
    మనుషుల మనసు ఒక్కోసారి పక్కదారి పడుతుంది. ఈ క్రమంలో వాళ్లు తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోతుంటారు. అనైతిక చర్యలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి తీవ్రమైన నేరాలు చేయడానికి కూడా వెనకాడరు. కొన్నేళ్ల క్రితం పెళ్లయిన ఈ ఫోటోలోని మహిళ కూడా ఇలాగే చేసింది. ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది. అనంతరం ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసింది. తనకేమీ తెలియదు అన్నట్టుగా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పింది. అయితే ఇక్కడే అసలు విషయం బయటపడింది. పాట్నా సమీపంలోని మసౌదిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    మసౌది పోలీస్ స్టేషన్‌కు హడావిడిగా వచ్చిన ఈ మహిళ.. తన భర్తపై ఎవరో హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోక దిగిన పోలీసులు.. స్పాట్‌కు చేరుకున్నారు. అక్కడ ఈమె భర్త అజయ్ కుమార్ రక్తపుమడుగులో పడి చనిపోవడాన్ని గుర్తించారు. కేసు విచారణను తమదైన స్టయిల్లో చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మరో వ్యక్తి సీన్‌లోకి వచ్చాడు. అతడి పేరే మహ్మద్ నౌషద్. నౌషద్ కలిసి ఆమె భర్తను హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

    అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా ? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అన్నది మరింత లోతుగా విచారణ చేస్తే కానీ తెలియదని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడి హత్యలో మాత్రం అతడి భార్య పాత్ర ఉందని నిర్ధారించారు. భర్తను హత్య చేసి నిందితురాలు.. కేసు నుంచి తప్పించుకునేందుకు తెలివిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొత్త కథ చెప్పేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. కారణం ఏమైనా.. కట్టుకున్న భర్తను మరో వ్యక్తితో కలిసి చంపిన ఈ మహిళ.. కేసు నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం బెడిసికొట్టాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: