Home /News /crime /

CRIME NEWS WIFE KILLED HUSBAND WITH THE HELP OF HER BOYFRIEND IN SIDDIPET DISTRICT NS

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రేమించి పెళ్లాడిన భర్తనే చంపిన భార్య.. తెలంగాణలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించి పెళ్లాడిన భర్తనే ఓ మహిళ ప్రియుడితో కలిసి చంపేసింది. తమ వివాహేతర సంబంధానికి(Illegal Affair) అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి కడతేర్చింది. ఏమీ తెలియనట్లు పోలీసులకు తన భర్త కనపడడం లేదని ఫిర్యాదు చేసింది.

ఇంకా చదవండి ...
    వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాలను ఆగం చేస్తున్నాయి. పరాయి వారితో సుఖం కోసం కొందరు కట్టుకున్నవారినే కడతేర్చడానికి సైతం వెనకాడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట శివారు కొత్తకుంటలో ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లాడిన భర్తనే ఓ మహిళ ప్రియుడితో కలిసి చంపేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి కడతేర్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు తన భర్త కనపడడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ కసాయి భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల ప్రకారం.. మద్దూర్‌ మండలం హన్మతండాకు చెందిన భూక్యా మోహన్‌(33) దాదాపుగా పన్నెండేళ్ల క్రితం అదే తండాకు చెందిన భూక్యా వినోదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం.

    ఈ క్రమంలో వారు కుటుంబ పోషణ కోసం సిద్దిపేటకు వలస వచ్చారు. మోహన్‌ ఓ హోటల్‌లో పని చేసేవాడు. అతడి భార్య నిర్మాణ పనులకు కూలీగా వెళ్లేది. అయితే ఆమెకు పనికి వెళ్లిన చోట కొండపాక మండలం మర్పడ్గకు చెందిన రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే కొన్ని రోజులకు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే వారు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మోహన్‌ను చంపాలని ప్లాన్ చేశారు. దీంతో నవంబరు 10న మోహన్‌కు వారిద్దరు కలిసి బాగా మద్యం తాగించారు. అనంతరం మరుసటి రోజు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మోహన్ ను బైక్ పై ఎల్లారెడ్డిపేట శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారు.
    వివాహ వేడుకలో బంగారం దొంగతనం.. దొంగ దంపతులకు బంధువుల దేహశుద్ధి

    అక్కడ రాజు, వినోద కలిసి మోహన్ కు ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం శవాన్ని కొత్తకుంటలో పడేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు. తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ వినోద మద్దూరు పోలీస్ స్టేషన్లో వినోద ఫిర్యాదు చేసింది. అయితే కొత్త కుంటలో శవం లభ్యం అవడంతో ఆ ఫొటోలను తోగుట పోలీసులు సోషల్ మీడియాలో ఉంచారు. ఆ ఫొటోలను చూసిన మోహన్ తల్లి శవాన్ని గుర్తించింది. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు రాజు, వినోద కలిసి మోహన్ ను చంపేశారని తెలిసింది. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Illegal affair, Siddipet, Telangana, TS Police, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు