Home /News /crime /

CRIME NEWS MOTHER DAUGHTER AND PERSON WHO HAVE ILLEGAL AFFAIR WITH THEM KILLED ANOTHER MAN AK

తల్లీకూతురితో వ్యక్తి వివాహేతర సంబంధం.. నిఘా పెట్టిన మరో వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నవీన్ తమ వివాహేతర సంబంధాలను బహిర్గతం చేసి తమ పరువు తీస్తాడేమో అని వారిద్దరూ టెన్షన్ పడ్డారు. దీని గురించి తాము సంబంధం పెట్టుకున్న రంజిత్‌కు తెలియజేశారు.

    ఓ యువకుడు చనిపోయాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మరణానికి కారణం ఏంటని అన్వేషణ మొదలుపెట్టారు పోలీసులు. ఆ యువకుడిని చంపింది ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి అని పోలీసుల విచారణలో తేలింది. అయితే వాళ్లు అతడిని ఎందుకు అలా చంపారని తెలిసి అంతా షాక్ అయ్యారు. అతడి మర్డర్ మిస్టరీ వెనుక ఊహించని కారణం ఉందని తెలుసుకున్నారు. ఇద్దరు మహిళలు, ఆ వ్యక్తి మధ్య ఉన్న సంబంధం గురించి ఆరా తీశారు. ఆ తరువాత వారిని కటకటాల వెనక్కి పంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలంగా తల్లితో ప్రేమాయణం, లైంగిక సంబంధం కొనసాగించిన రంజిత్.. ఆ తరువాత ఆమె కూతురితోనూ ఇదే రకమైన సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య వివాహేతర సంబంధం కొన్ని నెలలుగా సాగుతోంది.

    అయితే వీరి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధంపై నవీన్ అనే యువకుడు దృష్టి పెట్టాడు. తల్లి, కూతురు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని వారి బంధువులకు తెలియజేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డాడు. అయితే ఈ విషయం ఆ తల్లి, కూతురికి తెలిసిపోయింది. నవీన్ తమ వివాహేతర సంబంధాలను బహిర్గతం చేసి తమ పరువు తీస్తాడేమో అని వారిద్దరూ టెన్షన్ పడ్డారు. దీని గురించి తాము సంబంధం పెట్టుకున్న రంజిత్‌కు తెలియజేశారు. ఏం చేయాలని అతడి సలహా తీసుకున్నారు.

    ముగ్గురు కలిసి అతడిని హతమార్చాలని ప్లాన్ చేశారు. ఓ రోజు ఈ విషయం చెప్పకుండా నవీన్‌ను తమతో పాటు రావాలని కోరారు. అతడు వారితో వెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తరువాత రంజిత్ వారికి జతకలిశాడు. ముగ్గురు కలిసి నవీన్‌ను కర్రలతో చితకబాదారు. అనంతరం ఓ వైరుతో అతడి గొంతునులిమి చంపేశారు. పోలీసుల విచారణలో అతడిని ఎలా చంపారనే విషయాన్ని చెప్పిన రంజిత్, తల్లి, కూతురు.. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి కూడా బయటపెట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Illegal affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు