తోటి ఉద్యోగినిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు.. చివరకు కడుపు చేసి కాదన్నాడు.ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న రత్నాకర్( పేరు మార్పు) అదే పరిశ్రమలో పనిచేస్తున్నా తన తోటి ఉద్యోగిన దామిని( పేరు మార్పు)పై కన్నేశాడు. ఆమెతె చనువు పెంచుకున్నాడు. అంతేకాదు పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ట్రాప్ లో వేసుకున్నాడు. అయితే ఆ మాయగాడి మాటలు నమ్మిన యువతి...అతడితో చాలా సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. చివరకు అతడికి తన సర్వస్వం అర్పించింది. అయితే ఆ క్రమంలో దామిని గర్భవతి అయ్యింది. తనను పెళ్లి చేసుకొయమని నిలదీయగా, తనకు ఆమె గర్భానికి ఎలాంటి సంబంధం లేదని, తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. పైగా తనకు పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని బాంబు పేల్చాడు. దీంతో దామిని జీవితంలో మోసపోయానని నిర్ధారించుకుంది. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కాగా ఆమె సోదరి స్థానికులను పిలిచి దామినిని మృత్యుముఖం నుంచి కాపాడింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime story