ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని...ఆమెపై హత్య చేసి...తాను ఆత్మహత్యాయత్నం చేసి...దారుణం...

రమేష్ తన ప్రేయసి వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. అయితే, ఆ ప్రపోజల్ ని యువతి కాదన్నది. దీంతో, రమేష్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు.

news18-telugu
Updated: October 27, 2020, 10:55 PM IST
ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని...ఆమెపై హత్య చేసి...తాను ఆత్మహత్యాయత్నం చేసి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతను కాబోయే పోలీసు.. కానీ క్షణికావేశంలో అతను చేసిన ఓ పని, జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: మండ్యా జిల్లాకు చెందిన రమేష్, కాలేజీలో చదివే రోజుల్లో ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరి ప్రేమ కొన్ని సంవత్సరాలపాటు బాగానే సాగింది. తరచూ ఇద్దరు కలుసుకునేవారు. అయితే, ఇటీవల రమేష్ తన ప్రేయసి వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. అయితే, ఆ ప్రపోజల్ ని యువతి కాదన్నది. దీంతో, రమేష్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు.

దీంతో కోపంతో ఊగిపోయాడు, ఈ క్రమంలోనే, తాను ప్రేమించిన యువతి.. మరో వ్యక్తిని పెళ్లాడబోతోందన్న విషయం అతనికి తెలిసింది. దీంతో, మరింత కోపంతో ఊగిపోయిన రమేష్, తన ప్రేయసి పై దాడి చేశాడు. కాగా, యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ప్రేయసి పై దాడి అనంతరం, అతను ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో రమేష్ ప్రాణాలు కోల్పోగా, ఆమె మాత్రం చావు బతుకులతో పోరాడుతోంది. రమేష్ మరణం తర్వాత, ఇరు కుటుంబాలు పెద్దఎత్తున ఘర్షణలకు దిగారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: October 27, 2020, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading