పక్కింటి అంకుల్‌తో ఇంటర్ స్టూడెంట్ రాసలీలలు...వద్దని వారించగానే...తట్టుకోలేక...

కరోనా కారణంగా సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటూ ఓ వివాహితుడితో సాన్నిహిత్యంగా మెలిగింది. అది కాస్తా అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేవారు. ఇది గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు.

news18-telugu
Updated: July 13, 2020, 10:30 PM IST
పక్కింటి అంకుల్‌తో ఇంటర్ స్టూడెంట్ రాసలీలలు...వద్దని వారించగానే...తట్టుకోలేక...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వివాహితుడైన యువకుడితో అక్రమ సంబంధం వద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన బీహార్ లోని నలంద జిల్లాలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి రేష్మీ( పేరు మార్పు) స్థానిక కళాశాలలో 12వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటూ ఓ వివాహితుడితో సాన్నిహిత్యంగా మెలిగింది. అది కాస్తా అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేవారు. ఇది గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు.

అక్కడ నుంచి వివాహితుడికి ఫోన్‌ చేసి తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోతానని బెదిరించింది. దీంతో ఆ వ్యక్తి యువతి గ్రామానికి వెళ్లాడు. యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆ యువతి వినలేదు. తనను పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టింది. దీంతో ఇరు కుటుంబాలకు విషయం తెలియడంతో గొడవలు జరిగాయి. పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను స్టేషనుకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించి వేశారు. దీంతో యువతిని బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు ఇంట్లోనే కట్టడి చేశారు. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేయగా. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Published by: Krishna Adithya
First published: July 13, 2020, 10:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading