హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : మరీ ఇంత దారుణమా..! అవి చల్లగా ఉన్నాయని తుపాకితో కాల్చేశాడు..!

Crime : మరీ ఇంత దారుణమా..! అవి చల్లగా ఉన్నాయని తుపాకితో కాల్చేశాడు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime : కోపం మనిషి వివేకాన్ని చంపేస్తోంది. ఇది అక్షర సత్యం. కోపంలో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోయి.. దారుణాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

కోపం మనిషి వివేకాన్ని చంపేస్తోంది. ఇది అక్షర సత్యం. కోపంలో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోయి.. ఎన్నో ఘటనలకు బాధ్యులైన సంగతులు మన విన్నాం. ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. చపాతీల విషయంలో చోటు చేసుకున్న గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. చల్లని చపాతీలు తినడానికి ఇచ్చాడన్న కోపంతో ఓ డాబా యజమానిని తుపాకితో కాల్చాడో వ్యక్తి. హోటల్లో మనం ఆర్డర్‌ ఇచ్చే పదార్థాలు బాగ లేకపోయినా , చల్లాగా ఉన్న వాటిని మార్చి మళ్లీ వేరేవి తెప్పించుకుంటామ. కానీ.. ఓ వ్యక్తి చపాతీలు చల్లగా ఉన్నాయని డాబా యమమానిని తుపాకితో షూట్‌ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్‌ చౌహాన్‌, కసుస్తాబ్‌ సింగ్‌ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ డాబా దగ్గరకు వెళ్లారు. చపాతీలను ఆర్డర్‌ చేశారు. డాబాను మూయటానికి సిద్ధంగా ఉన్న దాని యజమాని మిగిలి ఉన్న చపాతీలను వారికి పెట్టాడు. అయితే చపాతీలు చల్లగా ఉన్నాయంటూ వారు అతడితో గొడవపడ్డారు.

ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహానికి గురైన కసుస్తాబ్‌ సింగ్‌ జేబులోని తుపాకి తీసి డాబా యజమానిని కాల్చేశాడు. బుల్లెట్‌ కుడి తొడలోకి దూసుకుపోయింది. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బుల్లెట్‌ను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Crime, Crime news, Gun fire, UP police, Uttar pradesh

ఉత్తమ కథలు