నిత్య పెళ్లికూతురు...భార్య లేని తాతయ్యలను పెళ్లి పేరుతో ఆశ చూపించి...

జుగల్ రెండో వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. దీంతో మోనికాను వివాహం చేసుకున్నాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా సంప్రదించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే రెండు నెలల పాటు అంతా బాగానే ఉంది. కానీ గత వారం కిషోర్ మేల్కొని చూడగా, మోనిక కనిపించలేదు.

news18-telugu
Updated: September 11, 2020, 6:57 AM IST
నిత్య పెళ్లికూతురు...భార్య లేని తాతయ్యలను పెళ్లి పేరుతో ఆశ చూపించి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్య చనిపోయి ఒంటరిగా మిగిలిపోయిన ముసలి వయస్సులోని వ్యక్తికి తోడుగా ఉంటానని ఓ మహిళ వారిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత డబ్బు, నగలతో ఉడాయించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు... పదకొండు సంవత్సరాల వ్యవధిలో,ఆ మహిళ ఎనిమిది మంది సీనియర్ సిటిజన్లతో వివాహం చేసుకుని, తన భర్తల నమ్మకాన్ని సంపాదించి, ఆ తరువాత నగదు ఆభరణాలతో అదృశ్యమయ్యేది. వివరాల్లోకి వెళితే మోనికా మాలిక్ అనే మహిళ గత నెల 66 ఏళ్ల జుగల్ కిషోర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, ఢిల్లీకి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ అయిన జుగల్ ఏడాది క్రితం భార్యను కోల్పోయాడు, దీంతో జుగల్ రెండో వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. దీంతో మోనికాను వివాహం చేసుకున్నాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా సంప్రదించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే రెండు నెలల పాటు అంతా బాగానే ఉంది. కానీ గత వారం కిషోర్ మేల్కొని చూడగా, మోనిక కనిపించలేదు. అంతేకాదు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు. సుమారు 45 లక్షల నగదు. అలాగే మరిన్ని విలువైన పత్రాలు తీసుకొని ఉడాయించింది. కాగా సిసిటివి ఫుటేజ్ ద్వారా ఆయన మోనికా ఇంట్లోంచి పారిపోవడాన్ని గమనించాడు. దీంతో జుగల్ కిషోర్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతర ఢిల్లీకి చెందిన మ్యాట్రిమోనియల్ ఏజెన్సీని నిలదీశాడు. దీంతో మోనిక అసలు బండారం బయటపడింది.

మోనికా గతంలో తనలాగే మరో వ్యక్తిని ఇలాగే పెళ్లి చేసుకొని అక్కడి నుంచి కూడా ఉడాయించిందని తెలుసుకున్నాడు. అయితే అతడిని సంప్రదించగా, అసలు విషయం బయటపడింది. ఆమె గత పదేళ్ళలో మోనికా ఎనిమిది మంది సీనియర్ సిటిజన్లను వివాహం చేసుకుందని. వారితో జస్ట్ ఒకటి లేద రెండు వారాల పాటు వివాహం తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు, నగదు, కార్లతో ఉడాయించిందని తేలింది. ఇదే విషయాన్ని పోలీసులు దర్యాప్తులో కూడా తేలింది. ఐపిసిలోని 420, 380,388,384, 120 బి సెక్షన్ల కింద మోనికాపై ఢిల్లి పోలీసుల సహాయంతో కిషోర్ కేసు నమోదు చేశారు. నిందితురాలు పరారీలో ఉంది.
Published by: Krishna Adithya
First published: September 11, 2020, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading