• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CRICKET BETTING MAFIA SPREADING IN ANDHRA PRADESH AS INDIAN PREMIER LEAGUE STARTS FULL DETAILS HERE PRN GNT

IPL Betting: కాయ్ రాజా కాయ్.., ఐపీఎల్ క్రేజ్ వెనుక చీకటి దందా..

IPL Betting: కాయ్ రాజా కాయ్.., ఐపీఎల్ క్రేజ్ వెనుక చీకటి దందా..

ఏపీలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్

Cricket Betting: ఐపీఎల్ (IPL-2021) స్టార్ట్ అయిందో లేదో బెట్టింగ్ ముఠాలు రెడీ అయిపోయాయి. ఏపీలో యువతే టార్గెట్ గా బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది.

  • Share this:
    ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మేనియా నడుస్తోంది. ఐపీఎల్ సీజన్ మొదలైతే చాలు క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లనే క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతూ మ్యాచులలో లీనమైపోతారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఐపీఎల్ కు ఫ్యాన్సే. ఏ జట్టు ఎంత స్కోర్ చేస్తుంది..? ఎవరు గెలుస్తారు..? ఏ క్రికెటర్ సిక్సలు, ఫోర్లతో హోరెతిస్తారనేదానిపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంటుంది. దాదాపు రెండు నెలల పాటు 50కి పైగా మ్యాచులు.. ఫ్యాన్స్ ను అలరిస్తాయి. దీంతో సమ్మర్ సీజన్ కాస్తా క్రికెట్ సీజన్ గా మారిపోతుంటుంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు చూస్తే ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ జాఢ్యం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బెట్టింగ్ కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా కారేజీ యువత బెట్టింగ్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటోంది. కొందరు ఈజీ మనీకి అలవాటుపడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని బలహీనతలను ఆసరాగా చేసుకుని బెట్టింగ్ ముఠాలు విచ్చల విడిగా పందేలకు పాల్పడుతున్నాయి.

    తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశతో.. చేతిలో ఉన్న చిన్నపాటి డబ్బును కూడా పోగొట్టుకుంటున్న కొందరు.. రోడ్డున పడుతున్నారు. కొందరు సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలో ఏపీలో చాలా చోటు చేసుకునాయి. ప్రతి ఏడాది వందల కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. టాస్ నుంచి మ్యాచ్ ఫలితం వరకు.. ప్లేయర్ల వ్యక్తిగత స్కోర్లు, సిక్సర్లు, ఫోర్ల కౌంట్, స్కోర్ ప్రెడిక్షన్స్ ఇలా బంతి బంతికి వందలు, వేలు, లక్షల వరకు పందేలు జరుగుతంటాయి. ఐతే ఇధంతా ఫోలీసలతు తెలియకుండానే జరుగుతుందా అంటే అందులో నిజం లేదు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు తెలిసే బెట్టింగ్ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. బెట్టింగ్ ముఠాలు పోలీసులకు బంగారు గుడ్లు పెట్టే బాతులుగా కనిపిస్తున్నాయి. బుకీలు తమకు స్థాయిని బట్టి..అధికారుల హోదాను బట్టి మామూళ్లు పంపిస్తు చేస్తుంటారు.

    ఎక్కడైనా బెట్టింగ్ వ్యవహారం బయటపడితే పోలీసులు కొన్నిరోజులు హడావిడి చేసి కొంతమందిని అరెస్ట్ చూపించిన అనంతరం.. వారి నుంచి ఎంతొ కొంత తీసుకోని చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ లోనే ఉండటంతో పోలీసులు వెంటనే స్పందించి బెట్టింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి బెట్టింగ్ దందాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు