Vizag: కాబోయే ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌లో జోరుగా బెట్టింగ్ దందా.. పాక్ లీగ్ పై బెట్టింగ్

పాక్ లీగ్ పై విశాఖలో క్రికెట్ బెట్టింగ్

పాకిస్థాన్ క్రికెట్ లీగ్ పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. అది కూడా విశాఖ పట్నంలో.. ఆ తతంగం మొత్తం చూసి పోలీసులే షాక్ కు గురయ్యారు.

 • Share this:
  సువిశాల సుందర నగరం.. ఐటీ హబ్.. పర్యాటక ప్రాంతం.. స్మార్ట్ సిటీ ఇలా ఎన్నో ఘనతలు సాధిస్తున్న విశాఖ ఇప్పుడు క్రైమ్ కు కేరాఫ్ గా మారుతోంది. ఇటీవల వరుస ప్రమాదాలు.. హత్యలు.. రౌడీ షీటర్ల దురాగతాలు.. మానభంగాలు.. కబ్జాలు.. సైబర్ మోసాలు.. మత్తు పదార్థాల సరఫరా.. ఒకటేంటి.. ప్రశాంతతకు మారుపేరైన విశాఖ నగరం ఇప్పుడు.. నగర వాసులకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా భారీగా బెట్టింగ్ దందా విశాఖ నుంచే సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లే లేవు కాదా.. బెట్టింగ్ దేనిపై నిర్వహిస్తున్నారని డౌట్ పడుతున్నారా..? విశాఖ నుంచి పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ లపై బెట్టింగ్ నిర్వహిస్తుంటే పోలీసులు గుట్టు రట్టు చేశారు. విశాఖలోని మధురవాడలో క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై పీఎం పాలెం పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. శ్రీరామ్ ప్రాపర్టీస్‌ భవనంలో పాక్ లీగ్​ మ్యాచ్​పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 2 టీవీలు, 32 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  శనివారం టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీరామ్ ప్రాపర్టీస్ సెలబ్రిటీ టవర్స్ ఫ్లోర్ 15 ఫ్లాట్ నెంబర్ 1 లో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి స్థానిక పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాకి చెందిన సభ్యులు గత మూడు నెలలుగా ఇక్కడ అద్దెకు ఉంటున్నట్టు తెలుసుకున్నారు. ఇందులో మొత్తం 5 గురుని నిందితులను పోలీసులు గుర్తించారు.

  ఇదీ చదవండి: ఆధ్యాత్మిక నగరంలో మత్తుకు బానిసలవుతున్న యూత్.. విద్యార్థులే ఆ గ్యాంగ్ టార్గెట్

  అయితే ప్రధాన నిందితుడు మాత్రం దొరకలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కేటుగాడి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. మిగతా వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. A1 గా చెబోలు శ్రీనివాస్ అతడే కేబుల్ @ కేబుల్ శ్రీను, A2కుంచంగి రవి కుమార్ s/o లేట్ పోతురాజు, A3 తమ్మిరెడ్డి ధనుంజయ్ s/o దాలి నాయుడు, A4 మార్పు శివాజీ S/o సుందర్ రావు, A5 వీరపనేని రాంబాబు s/o వేంకటేశ్వరు లు గా గుర్తించామన్నారు...

  ఇదీ చదవండి: ఏపీలో ఫలితమిస్తున్న కర్ఫ్యూ... వ్యాక్సినేషన్.. తగ్గుతున్న కేసులు

  ప్రధాన నిందితుడు చెబొలు శ్రీనివాస్ బెట్టింగ్ లు నిర్వహిస్తాడని.. మిగతా వాళ్ళు బెట్టింగులు సక్రమంగా నిర్వహిస్తున్నార లేదా అని చూసుకుంటారని గుర్తించారు. ఈ నెల 9 వ తేదీన మొదలైన పాకిస్థాన్ సూపర్ లీగ్ టి 20 క్రికెట్ మ్యాచ్ లు నుంచి ఈ బెట్టింగ్ లు మొదలయ్యాయని విచారణలో తేలింది. క్వెట్ట గ్లాడియేటర్ వెర్సెస్ పషవర్ మధ్య జరిగే మ్యాచ్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు రైడ్ చేసినట్టు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఒకేసారి 30 మందితో కమ్యూనికేట్ చేయగల సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సెటప్ బాక్స్ తో బెట్టింగ్ లో పాల్గొంటుండంగా రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ లైన్ గురు యాప్ ద్వారా వీక్షిస్తూ అసలు రేటింగ్ బదులుగా తప్పుడు రేటింగ్ చెప్తూ బెట్టింగ్ కాసేవరికి తప్పుదోవ పట్టిస్తున్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి ఒక కమ్యూనికేషన్ సెట్ ఆఫ్ బాక్స్, 2 లాప్ టాప్ లు, 2 ఎల్ జి కలర్ టీవీలు, ఒక శామ్సంగ్ టాబ్, మూడు వివో ఫోన్లు, ఒక ఎన్ ఎక్స్ టి డిజిటల్ సెట్ ఆఫ్ బాక్స్, ఒక ఎయిర్ టెల్ డొంగెల్, 5 అకౌంట్ పుస్తకాలు, రౌటర్ అలాగే రౌటర్ కనెక్టర్, 1590 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ లాంటి కార్యకలాపాలకు ఎవరు పాల్పిడినా కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు..
  Published by:Nagesh Paina
  First published: