Data Theft : 50 లక్షల భారతీయులకు షాక్... క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా చోరీ...

Credit, Debit Cards Data Theft : 50 లక్షల మంది అంటే తక్కువేమీ కాదు. వాళ్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేసుకోండి. కష్టపడి సంపాదించే డబ్బు హ్యాకర్ల చేతిలోకి వెళ్లకుండా చూసుకోండి.


Updated: February 9, 2020, 8:46 AM IST
Data Theft : 50 లక్షల భారతీయులకు షాక్... క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా చోరీ...
DARK WEB : 50 లక్షల భారతీయులకు షాక్... క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా చోరీ...
  • Share this:
Credit, Debit Cards Data Theft : క్రెడిట్, డెబిట్ కార్డులు మీ దగ్గరే ఉంటాయి. మరి వాటిలో డేటా... డార్క్ వెబ్ (Dark Web Hackers) చేతిలోకి ఎలా వెళ్లింది? మీ ఐడీలు, పాస్‌వర్డ్‌లూ వాళ్ల దగ్గరకు ఎలా చేరాయి అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసే ఓ వెబ్‌సైట్... సంవత్సరం నుంచీ భారతీయుల సీక్రెడ్ డేటా సేకరిస్తోంది. ఇప్పుడా సైట్... ఆ డేటాను అమ్మకానికి పెట్టింది. ఇలాంటి సమాచారం అమ్మకానికి దొరికితే అక్రమార్కులు కొనుక్కోకుండా ఉంటారా? మొత్తం 50 లక్షల మంది ఇండియన్స్ డేటా... హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఒక్కో డెబిట్ కార్డు రేటూ రూ.5వేలు, ఒక్కో క్రెడిట్ కార్డు రేటూ రూ.10వేలు అంటూ... ఇంటర్నెట్‌లో పెట్టి అమ్మి్తే... హాట్ కేకుల్లా కొనేశారు అక్రమార్కులు. రూ.5వేలు పెట్టి కొన్న వ్యక్తి సైలెంట్‌గా ఎందుకుంటాడు. అలాంటి డెబిట్ కార్డే క్లోనింగ్‌ది తయారుచేస్తాడు. అందుకు కావాల్సిన డేటా... ఆల్రెడీ ఉంటుంది కాబట్టి... నకిలీ కార్డు తయారుచేసి... దాంతో... ATMకి వెళ్లి... ఆ అకౌంట్‌లో డబ్బు మొత్తం డ్రా చేస్తాడు. అదే క్రెడిట్ కార్డైతే... క్లోన్ కార్డుతో విలువైన వస్తువుల్ని కొనేస్తారు. ఇదే ఇప్పుడు జరుగుతోంది.

జోకెర్స్ స్టాష్ (Joker’s Stash) అనే వెబ్‌సైట్... ఈ డేటాను అమ్మకానికి పెట్టింది. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డుల ఎక్స్‌పైరీ డేట్స్, 14-16 డిజిట్ కార్డ్ నంబర్స్, కార్డుదారుల నేమ్స్, CVV/CVC కోడ్లు, చివరకు ఈమెయిల్ అడ్రెస్‌లు కూడా అమ్మేస్తోంది. ఇండియాలో డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా చోరీల్లో ఇది రెండో అతి పెద్దది. మొత్తం 4,61,976 కార్డుల్ని ఒక్కోటీ 9 డాలర్లకు అమ్మి... రూ.30 కోట్లు ఆ వెబ్‌సైట్ సంపాదించినట్లు తెలిసింది. 2018-19లో మొత్తం 1866 డేటా చోరీ మోసాలు జరిగాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఒక్కో చోరీ వల్లా యావరేజ్‌గా రూ.20 లక్షలు పోయినట్లు స్పష్టమైంది.

తాజా చోరీపై దేశంలోని అన్ని బ్యాంకుల అధికారులూ అప్రమత్తమయ్యారు. ఎవరికైనా అనుమానిత ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు అనిపిస్తే వెంటనే తమ బ్రాంచ్‌కి రమ్మంటున్నారు. ఇలాంటి చోరీలను అడ్డుకోవడానికి బ్యాంకులు ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ చేపడుతున్నా... హ్యాకర్ల దాడులు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశం.
Published by: Krishna Kumar N
First published: February 9, 2020, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading