పెళ్లి కాకుండానే ఆ పని చేస్తూ దొరికిన వారికి బెత్తం దెబ్బలు... ఆ తర్వాత...

షరియా ప్రకారం శిక్షలు విధించిన ఇండోనేషియా అధికారులు... కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనంతరం బెత్తం దెబ్బలు కొట్టి విడుదల...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 8:51 PM IST
పెళ్లి కాకుండానే ఆ పని చేస్తూ దొరికిన వారికి బెత్తం దెబ్బలు... ఆ తర్వాత...
పెళ్లి కాకుండానే ఆ పని చేస్తూ దొరికిన ఎనిమిది మందికి బెత్తం దెబ్బలు (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 8:51 PM IST
ఇండోనేషియా...తరుచూ సునామీలు, భూకంపాలతో అతలాకుతలం అయ్యే ఈ దేశంలో ఇస్తామిక్ చట్టాలు అమలులో ఉంటాయి. ఈ ముస్లిం మెజారిటీ దేశంలో ఇస్లామిక్ చట్టం షరియాను కఠినంగా అమలు చేస్తారు. ఎవ్వరైనా తప్పు చేస్తే షరియాలో నిర్దేశించిన ప్రకారమే శిక్షలు విధిస్తారు. ఇస్లాం మతాచారం ప్రకారం పెళ్లి కాకుండానే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేయడం నేరం. సహజీవనం చేసినా, కలిసి తిరిగినా, ఏకాంతంగా గడిపినా వారు శిక్షార్హులే. తాజాగా ఇలా పట్టుబడిన నాలుగు జంటలకు షరియా ప్రకారం శిక్షలు విధించారు మతపెద్దలు. పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు... సీక్రెట్‌గా ఏకాంతంగా గడుపుతున్న ఓ ప్రేమ జంటను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరికి కొన్ని నెలల పాటు జైలు శిక్ష విధించారు.

జైలు శిక్ష పూర్తయిన తర్వాత బండా ఎసెహ్‌కి తీసుకొచ్చారు పోలీసులు. అక్కడ ఓ మసీద్ ఆవరణలో గ్రామస్థులందరి ముందు ఈ జంటలకు బెత్తం దెబ్బల శిక్షను అమలు చేశారు. ఒక్కొక్కరినీ 4 నుంచి 22 బెత్తం దెబ్బలు కొట్టిన మతాధికారులు... మళ్లీ ఈ తప్పు చేయమని ప్రమాణం చేయించుకుని వదిలేశారు. గత ఏడాది డిసెంబర్‌లో మైనర్ బాలికలతో సెక్స్ చేసినందుకు ఇద్దరు యువకులను తలా వంద బెత్తం దెబ్బలు కొట్టి శిక్షించారు అధికారులు.

ఇది కూడా చూడండి :-First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...