Home /News /crime /

CP SAJJANAR RESPONDS ON DOCTOR PRIYANKA REDDY MURDER CASE MS

షాద్‌నగర్ లైంగిక దాడి : ఆలస్యంపై స్పందించిన సీపీ సజ్జనార్

ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష

ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద జరిగిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు.

    రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద జరిగిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు. ప్రియాంక రెడ్డి 100కి డయల్ చేసి ఉంటే ప్రాణాలతో బయటపడేదని అన్నారు.ప్రియాంక రెడ్డిని కాపాడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే సమాచారం అందలేదని అన్నారు. అయితే సమాచారం రాగానే టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేశామని చెప్పారు. కేసును చేధించేందుకు మొత్తం 10 టీమ్స్ రంగంలోకి దిగాయన్నారు.

    ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయని, క్లూస్ సంపాదించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. కీలక ఆధారాలు ఇప్పటికే లభించాయని.. కేసు పురోగతిలో కాస్త ఆలస్యం జరిగిందని అన్నారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతామని తెలిపారు.ఇకపై మహిళలు,వృద్దులు ఎవరైనా ఆపదలో ఉంటే 100కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Hyderabad, Priyanka reddy murder, Telangana

    తదుపరి వార్తలు