హోమ్ /వార్తలు /క్రైమ్ /

Saidabad rape case: ఆ కామాంధుడి ఆచూకీ చెబితే గోప్యంగా ఉంచుతామన్న సీపీ అంజనీకుమార్‌​.. 10 లక్షల రివార్డూ ఇస్తామని ప్రకటన

Saidabad rape case: ఆ కామాంధుడి ఆచూకీ చెబితే గోప్యంగా ఉంచుతామన్న సీపీ అంజనీకుమార్‌​.. 10 లక్షల రివార్డూ ఇస్తామని ప్రకటన

నిందితుడి వివరాలు

నిందితుడి వివరాలు

సైదాబాద్‌ (Saidabad) చిన్నారి (girl)ని పొట్టన పెట్టుకున్న నిందితుడు రాజు ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడి జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ నాకా బందీలతో చెక్​ చేస్తున్నారు. అయితే నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఓ వైపు మీడియా మరోవైపు ప్రజలు ఈ విషయంపైనే ఫోకస్​ పెట్టడంతో పోలీసులకు కేసు సవాల్​గా మారింది.

ఇంకా చదవండి ...

  సైదాబాద్‌ (Saidabad) చిన్నారి (girl)ని పొట్టన పెట్టుకున్న నిందితుడు రాజు ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడి జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ నాకా బందీలతో చెక్​ చేస్తున్నారు. అయితే నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఓ వైపు మీడియా మరోవైపు ప్రజలు ఈ విషయంపైనే ఫోకస్​ పెట్టడంతో పోలీసులకు కేసు సవాల్​గా మారింది. దీంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిందితుడి ఆచూకీ కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే నిందితుడి పై రివార్డు (Reward) ప్రకటించింది హైదరాబాద్ పోలీస్‌ శాఖ. రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ (Hyderabad Police commissioner Anjani Kumar) రివార్డు ప్రకటించారు. ఆరేళ్ల చిన్నారి (Minor girl)పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుపై కీలక సమీక్ష నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు.

  నిందితుడు రాజు ఆనవాళ్లను విడుదల చేశారు కమిషనర్​ అంజనీ కుమార్‌. రాజు (raju) రెండు చేతులపై మౌనిక (Mounika) అనే టాటూ ఉందన్నారు. వయస్సు సుమారు 30 ఏళ్లుగా (30 years) ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌  (Rubber band) వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వాళ్లు పోలీసులకు ఫోన్‌ (Phone) చేయాలని కోరారు. ఆ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు (10 lakh reward) ఇస్తామంటూ ఓ ప్రకటన ను కూడా విడుదల చేశారు.

  హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇవ్వడంతో పాటు… వారి వివరాలను (details) చాలా గోప్యంగా (Secret) ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నాం అన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 , 9490616627 అనే ఫోన్‌ నంబర్ల కు సమాచారం (Information) ఇవ్వాలని హైదరాబాద్‌ సీపీ (CP) తెలిపారు. ఇక ఇప్పటికే నిందితుడి ఆనవాళ్లు విడుదల చేశారు పోలీసులు.

  Saidabad Raju details
  Saidabad Raju details

  నాలుగు రోజులు క్రితం సైదాబాద్‌ (Saidabad) బస్తిలో నివాసం ఉండే ఆరేళ్ల చిన్నారీకి చాక్లెట్ ఆశ చూపి తన గదికి తీసుకు వెళ్లిన నిందితుడు దారుణంగా హత్య చేసి తన గదిలోనే తాళం (lock)వేసి బయటకు వచ్చాడు. అయితే ఇదే అంశంపై పోలీసులకు చెప్పినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించక పోవడంతోనే ఈ సంఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే..

  అయితే గత నాలుగు రోజులుగా పోలీసులు వెతుకున్న సమయంలో సంఘటన అనంతరం నిందితుడు పారిపోయేందుకు అత్యాచారం జరిగిన బస్తీలోనే అతని స్నేహితుడు సహకరించినట్టుగా పోలీసులు (police) గుర్తించారు. ఈ క్రమంలో సీసీ టీవీ కెమెరాలు (cc camera) పరీశీలించారు పోలీసులు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Child rape, Crime news, Hyderabad police, Murder, Police commissionarate, Reward

  ఉత్తమ కథలు