హోమ్ /వార్తలు /క్రైమ్ /

Honor Killing: ఒక్కటవుదామనుకున్న వరుసకు అన్నాచెల్లెళ్లు.. కిరాతకంగా చంపేసిన కుటుంబ సభ్యులు

Honor Killing: ఒక్కటవుదామనుకున్న వరుసకు అన్నాచెల్లెళ్లు.. కిరాతకంగా చంపేసిన కుటుంబ సభ్యులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Honor Killing: వరుసకు అన్నాచెల్లెళ్లు అయిన 21 ఏళ్ల యువకుడు, 20 ఏళ్ల యువతి ప్రేమించుకోవడం వారి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులే ఆ జంటను దారుణంగా హతమార్చారు.

దేశ వ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో హేమంత్ హత్య ఘటన మరవకముందే ఛత్తీస్ గడ్ లో అలాంటి మరో దారుణం చోటు చేసుకుంది. వరుసకు అన్నాచెల్లెళ్లు అయిన 21 ఏళ్ల యువకుడు, 20 ఏళ్ల యువతి ప్రేమించుకోవడం వారి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులే ఆ జంటను దారుణంగా హతమార్చారు. వారి ఇద్దరికి విషం ఇచ్చి చంపి ఓ నది ఒడ్డున తగులబెట్టారు. నిందితుల ఇళ్లలో ఏదో జరుగుతుందన్న అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా నిందితులు నిజాన్ని ఒప్పుకున్నారు. వారు ప్రేమించుకోవడం నచ్చకపోవడంతో దారుణంగా చంపేశామని అంగీకరించారు. దీంతో పోలీసులు పాక్షికంగా కాలిన మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. దుర్గ్ జిల్లాలోని కృష్ణానగర్ లో పక్కపక్క ఇళ్లలో శ్రీహరి(21), ఐశ్వర్య (20) నివసిస్తున్నారు. వారు ఇద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే వీరిద్దరు గత నెలలో ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పారిపోయారు. అనంతరం చెన్నై వెళ్లి అక్కడ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వీరి కోసం ముమ్మరంగా గాలించారు. వీరు చైన్నైలో ఉన్నారని కొన్ని రోజులకు దుర్గ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీసుల బృందం అక్టోబర్ 7న వీరిని చెన్నై నుంచి సొంత ప్రాంతానికి తీసుకువచ్చింది. అనంతరం వీరిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న స్థానిక పోలీసులకు శ్రీహరి, ఐశ్వర్య నివాసాల్లో ఏదో అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇళ్లలోకి వెళ్లి అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు. దీంతో శ్రీహరి, ఐశ్వర్యకు విషం ఇచ్చి చంపామని నిందితులు అంగీకరించారు. శవాలను జెవ్రా సిర్సా గ్రామానికి సమీపంలో ఉన్న శివనాథ్ నది ఒడ్డుకు తీసుకెళ్లి తగలబెట్టినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు పాక్షికంగా కాలిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు ప్రేమించుకోవడం ఇష్టంలేకనే చంపేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులపై ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Honor Killing, Lovers, Murder

ఉత్తమ కథలు