బంధువే అని హోటల్‌‌ రూమ్‌లో కలిసుంటే.. రాత్రి నిద్రపోయాక..

బంధువే కదా అని హోటల్ రూమ్‌లో కలిసి ఉన్నందుకు.. ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. రాత్రి పూట ఆమె నిద్రలోకి జారుకున్నాక ఆమెపై తన కర్కషాన్ని చూపాడు ఆ కామాంధుడు.

news18-telugu
Updated: November 11, 2019, 3:55 PM IST
బంధువే అని హోటల్‌‌ రూమ్‌లో కలిసుంటే.. రాత్రి నిద్రపోయాక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంధువే కదా అని హోటల్ రూమ్‌లో కలిసి ఉన్నందుకు.. ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. రాత్రి పూట ఆమె నిద్రలోకి జారుకున్నాక ఆమెపై తన కర్కషాన్ని చూపాడు ఆ కామాంధుడు. ఈ దారుణ ఘటన గుర్గావ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన యువతి(24).. ఎగ్జామ్ రాసేందుకు గుర్గావ్‌కు వచ్చింది. అయితే, అక్కడ తెలిసిన వాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో హోటల్ గదిలో ఉండాలని నిర్ణయించుకుంది. ఇంతలో తెలిసిన అతడు.. వరసకు బావ అయ్యే వ్యక్తి కూడా అదే హోటల్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతడు ఆమెను కలిసి, తనతో పాటే గదిలో ఉండవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. ముందుగా వద్దని చెప్పినా బలవంత పెట్టడంతో సరేనంది. తెలిసినవాడే.. పైగా బంధువే కదా అనుకొని అతడితో పాటు ఉండటానికి ఒప్పుకుంది. దీన్ని అదనుగా తీసుకున్న ఆ దుర్మార్గుడు తనలోని క్రూరవాంఛను తీర్చుకోవాలనుకున్నాడు. ఆ యువతి రాత్రి భోజనం చేశాక.. నిద్రపోయే వరకు వేచి చూశాడు.

ఆమె నిద్రలోకి జారుకున్నాక.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతికి మెలకువ అయ్యి లేచి అతడు తనను ఏదో చేస్తున్నట్లు గుర్తించింది. ఎంత బతిమాలినా విడిచిపెట్టకపోగా.. రేప్ చేసినట్లు ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ యువతి.. పరీక్ష రాసేసి, సొంతూరుకు వెళ్లిపోయింది. కానీ.. ఇంట్లో వాళ్లకు జరిగిన ఘటన గురించి చెప్పలేదు.

కొన్ని రోజులకు ఆమె ట్రామాలోకి వెళ్లిపోవడంతో.. వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన సైకియాట్రిస్టు ఈమె ఏదో భయానక ఘటనను ఎదుర్కొందని వెల్లడించారు. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అసలు నిజాన్ని ఆమె బయటపెట్టింది. ఈ ఘటన సెప్టెంబరు 22న జరిగిందని, ఆదివారం నాడు యువతి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...