హోమ్ /వార్తలు /క్రైమ్ /

Khammam: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Khammam: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

4.  ఈ కేసుపై మద్రాసు హైకోర్టు ఇప్ప‌టికే తీర్పు నిచ్చింది. ఆ తీర్పును వ్య‌తిరేఖిస్తూ బాధితులు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపూ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

4. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు ఇప్ప‌టికే తీర్పు నిచ్చింది. ఆ తీర్పును వ్య‌తిరేఖిస్తూ బాధితులు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపూ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేష్ (ganesh) అలియాస్ చింటూ (20)కి కిరాణా దుకాణం ఉంది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..  గతేడాది నవంబరు 19న చాక్లెట్ కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వచ్చిన బాలిక(4)ను చూసిన చింటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఇంకా చదవండి ...

గతేడాది నాలుగేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడో కామాంధుడు. చాక్లెట్లు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చిన ఆ చిన్నారిపై ఈ కర్కశత్వానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి(child) చెప్పింది విని తల్లిదండ్రులు హుతాశులయ్యారు. ఇపుడు ఆ కామాంధుడికి కోర్టు(court) కఠిన శిక్ష(sentenced) విధించింది. సమాజంలో ఉన్న చీడపురుగులకు ఓ హెచ్చరిక పంపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేష్ (ganesh) అలియాస్ చింటూ (20)కి కిరాణా దుకాణం ఉంది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..  గతేడాది నవంబరు 19న చాక్లెట్ కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వచ్చిన బాలిక(4)ను చూసి కామాంధుడిగా మారడు. అంతే చింటూ ఆ పసిపాపను ఇంట్లోకి తీసుకెళ్లి కర్కశంగా అత్యాచారం చేశాడు.

అయితే ఘటన అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం ఈ కేసు తుది విచారణకు రాగా, ఖమ్మం(Khammam) మొదటి అరకపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ నిందితుడు గణేశ్(ganesh)​ను దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష(sentenced) విధించారు. కాగా, గత నెలలోనే చిన్నారిపై అత్యాచారం కేసులో నాంపల్లిలోని కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. ఈ మేరకు దోషి చెన్నయ్యకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబర్​లో బంజారాహిల్స్ రాజు పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై చెన్నయ్య (50) అత్యాచారానికి పాల్పడ్డాడు. బొమ్మలు ఇస్తాడు. నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో కోర్టు శిక్ష విధించింది. కాగా, దేశంలో చిన్నారులు, మహిళలపై ఆకృత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. త్వరితగతిన పరిష్కరించే అవకాశాలు లేక చాలా కేసులు మరుగున పడిపోతున్నాయి. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులకు చాలా తక్కువ కేసులు వెళుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లో ఉన్నట్లు దిశ తరహా చట్టాలు వస్తేనే కేసులు త్వరితగతిన పరిష్కరించబడుతాయని పలువురు భావిస్తున్నారు. దిశ చట్టం అమల్లో ఉంటే అత్యాచారం కేసుల్లో  21 రోజుల్లోనే తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్రాలు దిశ తరహా చట్టాల రూపకల్పనపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం దిశ తరహా చట్టంపై అసెంబ్లీలో చర్చలు సైతం జరిపింది. అయితే ఆంధ్రప్రదేశ్​లోని దిశ చట్టంపై కేంద్రం సంతృప్తిగా లేదని వాదనలూ ఉన్నాయి. అందుకే దాన్ని ఆమోదించలేదు. కొన్ని సవరణలు సైతం చెప్పినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Child rape, Crime news, Khammam

ఉత్తమ కథలు