Court Bail: వింత తీర్పు.. బెయిల్ మంజూరు చేయాలంటే.. ఈ పని చేయాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

Court Bail: రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బిహీర్ లోని ఓ కొర్టు ఒక కండీషన్ తో బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత 6 నెలల గ్రామంలోని మహిళల బట్టలు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై(Womens) హత్యలు(Murders), అత్యాచారాలు(Rape) ఆగడం లేదు. నిర్భయ(Nirbhaya), దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.

  Telangana Crime: భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించిఉండరు..


  ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

  ఇలాంటి ఘటనే ఒకటి బీహార్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అందులో మధుబానీ జిల్లాలో ఓ మహిళ పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు తో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ఈ కేసులో స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశం చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బీహార్ లోని ఓ కోర్టు వింత కండీషన్ తో బెయిల్ మంజూరు చేసింది.

  ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్య ఇంత పని చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.. చివరకు..


  జైలు నుంచి విడుదలయ్యాక 6 నెలల పాలు గ్రామంలోని 2వేల మంది మహిళల బట్టలు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో ఆ నిందితుడుకి బెయిల్‌ కూడా మంజూరు చేసింది. మధుబని జిల్లాలో లలన్ కుమార్ అనే ఈ వ్యక్తి లాండ్రీ షాపు నడుపుతున్నాడు. ఏప్రిల్ 17న అదే గ్రామానికి చెందిన ఓ మహిలపై లైంగికదాడి చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏప్రిల్ 19న లలన్ ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి లలన్ జైల్లోనే ఉన్నాడు అని డిఫెన్స్ లాయర్ పరశురామ్ మిశ్రా చెప్పారు. అదనపు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాము.

  జైల్లో లలన్ మంచి ప్రవర్తన, క్షమాపణ చెప్పడాన్ని పరిగణలోకి తీసుకుని నా క్లైంట్ కు బెయిల్ ఇచ్చింది. గ్రామానికి చెందిన 2వేల మంది మహిళల దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయాలని కోర్టు కండీషన్ పెట్టిందిఅని లాయర్ చెప్పారు. వింత కండీషన్ పెట్టడమే కాదు.. ఆ బెయిల్ కాపీని కోర్టు గ్రామ పెద్ద నసిమా ఖాటూన్ కు కూడా పంపింది. లలన్ ఉచితంగా బట్టలు ఉతికి, ఇస్త్రీ చేస్తాడో లేదో కనిపెట్టుకుని ఉండాలని గ్రామ పెద్దకు చెప్పింది.
  Published by:Veera Babu
  First published: