Home /News /crime /

COUPLES FIGHT LEADS TO DEATH OF HOUSE OWNER IN TELANGANA NK

భార్యభర్తల గొడవ... ఇంటి ఓనర్ హత్య... ఎలా జరిగిందంటే...

భార్యభర్తల గొడవ... ఇంటి ఓనర్ హత్య... (File)

భార్యభర్తల గొడవ... ఇంటి ఓనర్ హత్య... (File)

Telangana : మీరు చదివింది నిజమే. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ... ఆ ఇంటి ఓనర్ చావుకొచ్చింది. అదెలా జరిగిందో తెలుసుకొని తీరడం మనకే మంచిది.

    Telangana : మీరు టీవీ సౌండ్ బాగా పెంచుకొని చూస్తారా... మీ పక్కింటి వాళ్లకు కూడా వినిపించేంత సౌండ్ పెట్టుకుంటారా... ఐతే... మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు. ఎందుకంటే... అలాంటి ఓ డేంజర్ ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా... ఆర్మూరులో... అదో ఇల్లు. 40 ఏళ్ల రాజేందర్ ఆ ఇంటి ఓనర్. పక్కింటిని అద్దెకు ఇచ్చాడు. అందులో భార్యాభర్త ఉంటున్నారు. ఓ రోజు వాళ్లిద్దరూ గొడవపడసాగారు. కయ్ కయ్ మంటూ ఒకటే అరుపులు. అదే సమయంలో రాత్రి వేళ టీవీలో తనకు ఇష్టమైన సీరియల్‌ను ఫ్యామిలీతో కలిసి... చూస్తున్నారు రాజేందర్. పక్కింట్లో అరుపులు ఎక్కువయ్యాయి. ఎంతలా అంటే... సీరియల్‌లో డైలాగ్స్ కూడా సరిగా వినిపించట్లేదు. దాంతో... రాజేందర్ భార్య... కాస్త వాల్యూమ్ పెంచండి... వాళ్ల వల్ల మనకేమీ అర్థం కావట్లేదు అన్నారు. చేతిలోనే రిమోట్ ఉంచుకున్న రాజేందర్... దాందేముంది పెంచేస్తా అంటూ సౌండ్ మరింత పెంచారు. అప్పుడు... ఆ భార్యాభర్తలు మాట్లాడుకునే (పోట్లాడుకునే) మాటలు వాళ్లకు వినిపించకుండా... మధ్యలో టీవీ సీరియల్ సౌండ్ ఎక్కువైపోయింది. మేమిద్దరం దెబ్బలాడుకుంటుంటే... వీళ్లు మాత్రం చక్కగా టీవీ చూస్తున్నారు. పైగా ఆ సౌండేంటి... అంటూ... భర్త బాలనర్సయ్య... ఓనర్ ఇంటికి వెళ్లాడు.

    ఆ సౌండేంటి... పక్కింట్లో మేం ఉండాలా వద్దా... అంత సౌండ్ పెడితే ఎలా అంటూ ఫైర్ అయ్యాడు. అద్దెకు ఉండే వ్యక్తే అంతలా ఫైర్ అయితే... ఇంటి ఓనర్‌ని నాకెంత ఉండాలి... అనుకుంటూ రాజేందర్... ఆ అవును... పెంచాను... ఇంకా పెంచుతాను... ఏంటట... ఏం చేస్తావ్... అంటూ మరింత పెంచబోతుంటే... ఏం చేస్తానా... ఏం చేస్తానంటే... అంటూ అటూ ఇటూ చూసి... ఏ రాడ్డూ కనిపించకపోవడంతో... ఆవేశంతో రగిలిపోతూ... రాజేందర్ దగ్గరకు వెళ్లి... సౌండ్ తగ్గించు తగ్గించూ అంటూనే గట్టిగా తలపై చేత్తో కొట్టాడు. అంతే... రాజేందర్ దడేల్ మని కింద పడ్డారు. ఆయన చేతిలో రిమోట్ కిందపడి... ముక్కలై... అందులో బ్యాటరీ బయటికొచ్చేసింది.

    కిందపడిన రాజేందర్ కదలకుండా శవంలా ఉండేసరికి... అందరూ షాకయ్యారు. రాజేందర్ భార్య టీవీ కట్టేసి... ఏవండి... ఏవండి అంటుంటే... ఆయన కదలడే. అదే సమయంలో... బాల నర్సయ్య కూడా రాజేందర్‌ను అటూ ఇటూ కదిపాడు. కదలడే. వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు నాడి పట్టుకొని... విచారంగా చూస్తూ... ఏదో చెప్పారు. అంతే... రాజేందర్ భార్య, కొడుకూ... కన్నీటి సంద్రమయ్యారు. డాక్టర్ మాట వినగానే... మెల్లగా అడుగులు వేస్తూ... అక్కడి నుంచీ పారిపోయాడు బాలనర్సయ్య.

    విషయం పోలీసులకు తెలిసింది. రాజేందర్ భార్యను వివరాలు అడిగారు. ఆమె ఏడుస్తూ చెప్పింది విని ఆశ్చర్యపోతూ... ఆ సమయంలో మళ్లీ మళ్లీ ఆమెను మరింత వివరంగా చెప్పమని అడగలేక... సరేలే అని వాంగ్మూలం నమోదు చేశారు. ఇలా భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఓనర్ ప్రాణాలు తీసింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telangana News, Telangana updates

    తదుపరి వార్తలు