Home /News /crime /

Sad: ఆవును వెతుక్కుంటూ వెళితే చావు ఎదురొచ్చింది.. పాపం ఆ మూగజీవి కూడా.. అసలేం జరిగిందంటే..

Sad: ఆవును వెతుక్కుంటూ వెళితే చావు ఎదురొచ్చింది.. పాపం ఆ మూగజీవి కూడా.. అసలేం జరిగిందంటే..

అశ్విని, జయప్రకాష్ పెళ్లి నాటి ఫొటో

అశ్విని, జయప్రకాష్ పెళ్లి నాటి ఫొటో

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. వెల్లూరు జిల్లాలో రాత్రి సమయంలో కనిపించకుండాపోయిన తమ ఆవు కోసం వెతుక్కుంటూ వెళ్లిన భార్యాభర్తలు తిరిగి ఎంతసేపయినా ఇంటికి రాలేదు. దీంతో.. ఏమైందా అని చుట్టుపక్కల వెళ్లి చూడగా.. బంధువులకు హృదయవిదారక దృశ్యం కనిపించింది.

ఇంకా చదవండి ...
    వెల్లూరు: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. వెల్లూరు జిల్లాలో రాత్రి సమయంలో కనిపించకుండాపోయిన తమ ఆవు కోసం వెతుక్కుంటూ వెళ్లిన భార్యాభర్తలు తిరిగి ఎంతసేపయినా ఇంటికి రాలేదు. దీంతో.. ఏమైందా అని చుట్టుపక్కల వెళ్లి చూడగా.. బంధువులకు హృదయవిదారక దృశ్యం కనిపించింది. భార్యాభర్తలిద్దరూ విగత జీవులుగా కనిపించారు. ఆ పక్కనే ఆవు కూడా చనిపోయి పడి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. వెల్లూరు జిల్లా తిరువళం సమీపంలో ఉల్లి పుత్తూరు అనే గ్రామం ఉంది. ఈ ఊరిలో జయప్రకాష్, అశ్విని అనే భార్యాభర్తలున్నారు. వ్యవసాయంతో పాటు పశుపోషణ చేసుకుంటూ ఈ కుటుంబం జీవిస్తోంది. అయితే.. రాత్రి సమయంలో ఆవు కనిపించకుండాపోవడంతో ఎక్కడికి వెళ్లిందో అని ఆందోళన చెందిన భార్యాభర్తలు ఆవును వెతుక్కుంటూ వెళ్లారు. అయితే.. జయప్రకాష్, అశ్విని వెళ్లి గంటలు గడుస్తున్నా ఆవు రాలేదు. వాళ్లూ రాలేదు. దీంతో.. కంగారుపడిన వీళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు వీరి కోసం వెతుకులాట సాగించారు.



    విజయకుమార్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో భార్యాభర్తలు చలనం లేకుండా పడి ఉండటాన్ని గమనించారు. ఆ పక్కనే ఆవు కూడా పడిపోయి ఉంది. భార్యాభర్తలతో సహా ఆ ఆవు కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. జయప్రకాష్ బంధువులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. తిరువళం పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. విజయ్‌కుమార్ అనే వ్యక్తి స్థలంలో అలా విగత జీవులుగా పడి ఉండటం వెనుక కారణాన్ని పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆ గ్రామంలోని తన స్థలంలోకి జంతువులు ఏవీ రాకుండా ఉండేందుకు విజయకుమార్ ఆ స్థలం చుట్టూ అక్రమంగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించినట్లు తేల్చారు. ఆవు ఆ ఫెన్సింగ్‌లో చిక్కుకునే కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

    ఇది కూడా చదవండి: Husband: చనిపోయే ముందు భార్యకు ఓ పచ్చి నిజం చెప్పాడు.. అలా ఈ ముగ్గురు చేసిన నీచమైన పని బయటపడింది..

    ఆవును వెతుక్కుంటూ వెళ్లిన భార్యాభర్తలు అశ్విని, జయప్రకాష్ కూడా చీకట్లో చూసుకోకుండా ఆ ఫెన్సింగ్‌కు తగలడంతో షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. ఆ సమయంలో వారిని ఎవరూ గమనించకపోవడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయితే.. వాళ్లు కరెంట్ షాక్‌కు గురై చనిపోయి తన స్థలంలో మృతదేహాలుగా కనిపించడంతో విజయకుమార్ తన మీదకు కేసు రాకుండా ఉండేందుకు అప్పటికప్పుడే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌ను తీసేయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ స్థలం యజమాని విజయ్‌కుమార్‌తో పాటు మరికొందరిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Couple died, Cow, Crime news, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు