భర్త చూస్తుండగానే మహిళపై తుపాకి గురిపెట్టి...లైంగిక దాడి...

ఆటో డ్రైవర్ పారిపోగా మహిళను చెరబట్టి ఆమె భర్త, కుమారుడిపై దాడి చేశారు. అనంతరం మహిళపై లైంగిక దాడికి పాల్పడుతుండగా, భర్త వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అంతేకాదు అతనిపై కాల్పులు జరపడంతో పాటు కత్తితో కూడా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

news18-telugu
Updated: September 10, 2019, 5:36 PM IST
భర్త చూస్తుండగానే మహిళపై తుపాకి గురిపెట్టి...లైంగిక దాడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని అడ్డగించి భర్తతో పాటు ఆమె పిల్లవాడిని బంధించి తుపాకితో బెదిరించి ఇద్దరు దుండగులు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే అమ్రోహ జిల్లాకు చెందిన బాధిత కుటుంబం చాంద్‌పూర్‌లో ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి తమ స్వస్థలం బిజ్నోర్‌కు ఆటో రిక్షాలో వెళుతుండగా, ఇద్దరు సాయుధులైన దుండగులు వారిని అడ్డగించారు. ఆటో డ్రైవర్ పారిపోగా మహిళను చెరబట్టి ఆమె భర్త, కుమారుడిపై దాడి చేశారు. అనంతరం మహిళపై లైంగిక దాడికి పాల్పడుతుండగా, భర్త వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అంతేకాదు అతనిపై కాల్పులు జరపడంతో పాటు కత్తితో కూడా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

మహిళపై లైంగిక దాడికి చేస్తుండగా, సమీపంలోని గ్రామస్తులు దుండగులపై దాడి చేసేందుకు ప్రయత్నించగా, వారు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. అనంతరం బాధిత మహిళను, ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగులను గాలిస్తున్నారు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>