హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తున్న కుటుంబం..కారుతో తొక్కించుకుంటూ వెళ్లిన డ్రైవర్

Shocking : రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తున్న కుటుంబం..కారుతో తొక్కించుకుంటూ వెళ్లిన డ్రైవర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Family Died In Accident : మధ్యప్రదేశ్​(Madhyapradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వేచి చూస్తున్న ఓ కుటుంబంపైకి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది.

Family Died In Accident : మధ్యప్రదేశ్​(Madhyapradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వేచి చూస్తున్న ఓ కుటుంబంపైకి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నాం గ్వాలియర్ కి 22 కి.మీ దూరంలోని బరాగావ్​ ఖురాయ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

గ్వాలియర్ జిల్లాలోని బరాగావ్​ ఖురాయ్​ గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి గురువారం ఓ కుటుంబం హాజరైంది. కార్యక్రమం పూర్తయ్యాక బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా నడుపుతూ రోడ్డుపై వేచి ఉన్న వారిపైకి కారుతో దూసుకెళ్లాడు ఓ డ్రైవర్​. ఈ ఘటనలో భార్యా-భర్తతో పాటు వారి ఇద్దరి మైనర్ కూతుళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులను పప్పు జఠవ్ (50), అతడి భార్య రాజా బేటీ (35), వారి కుమార్తెలు రేష్మ (10), పూనమ్​గా (5) గుర్తించారు. ఇక,ఘటన తర్వాత డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. పరారయ్యాడు. గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇక, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు.

ALSO READ  Gutka stain inside aircraft : విమానంలో గుట్కా మరక..చొక్కా విప్పించి తుడిపించాలంటూ నెటిజన్లు ఫైర్

మరోవైపు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది బలయ్యారు. ఓ ఘటనలో ఏకంగా కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం కృష్ణా జిల్లా (Krishna District) లో ఘోర ప్రమాదం జరిగింది. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామానికి చెందిన పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగే పెళ్లికి ఆటోలో వెళ్లగా చల్లపల్లి వద్ద కాశానగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఘటనలో ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందారు. పలువురుకి తీవ్రగాయాలవగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నారు. ఘటనాస్థలిలో గాయపడిన వారు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయానకంగా మారింది. అప్పటివరకు సందడిగా సాగిన ప్రయాణం రోడ్డు ప్రమాదంతో విషాదంగా మారింది. ఐతే ఆటోలో 21 మంది ప్రయాణికులు ఉండటంతో అంత బరువుమీద కంట్రోల్ కాకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా (Annamayya District) లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి మండలంలోని పుంగనూరు రోడ్డులో 150 మైలు వద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. అతివేగంగా కారుణంగా అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీ కొట్టి చెరువులో బోల్తాపడింది

First published:

Tags: Car accident, Madhya pradesh

ఉత్తమ కథలు