COUPLE IN KAMAREDDY QUARREL ABOUT SIX THOUSAND RUPEES FINALLY IT LEADS TO SAD ENDING NZB SSR
KamaReddy: రూ.6 వేల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. చివరికి వీటిని చూసి గుర్తుపట్టాల్సొచ్చింది..
స్పాట్లో పోచవ్వ దుస్తులు, చెప్పులు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, చిన్నచిన్న గొడవలు సహజం. సర్దుకుపోతూ ముందుకెళితేనే ఆ కాపురం సాఫీగా సాగుతుంది. లేకపోతే విషాదాంతాలకు దారితీస్తుంది. కామారెడ్డి జిల్లాలో అదే జరిగింది. ఆరు వేల రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైంది.
కామారెడ్డి:భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, చిన్నచిన్న గొడవలు సహజం. సర్దుకుపోతూ ముందుకెళితేనే ఆ కాపురం సాఫీగా సాగుతుంది. లేకపోతే విషాదాంతాలకు దారితీస్తుంది. కామారెడ్డి జిల్లాలో అదే జరిగింది. ఆరు వేల రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైంది. భర్త కాలిపోయిన స్థితిలో కనిపించగా, భార్య కుంటలో శవమై తేలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసాంగికాలనీకి చెందిన కోదండం సాయిలు, పోచవ్వ దంపతులు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఇద్దరికీ వివాహమైంది. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే.. అక్టోబర్ 27న ఇంట్లో కనిపించకుండాపోయిన రూ.6 వేల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. సాయిలు, పోచవ్వ అక్టోబర్ 28న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఇద్దరి కోసం వెతకని చోటు లేదు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఇద్దరి కోసం వెతుకులాట సాగించగా ఆదివారం నాడు రాజానగర్ ప్రాంతంలోని చర్చి కాలనీలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.
సాయిలు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా, పోచవ్వ అక్కడే దగ్గర్లోని కుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోచవ్వ అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. సాయిలుకు ఇంతకు మునుపే ఇద్దరు మహిళలతో వివాహమైంది. అయితే.. ఆ ఇద్దరూ అనారోగ్యం బారిన పడి చనిపోయారు.
పోచవ్వ సాయిలుకు మూడో భార్య. వీళ్లకు పిల్లలు లేరు. అక్టోబర్ 27న డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే.. ఆ రాత్రి గొడవ పడి నిద్రించిన భార్యాభర్తలు మరుసటి రోజు మళ్లీ గొడవ పడ్డారు. 28న ఉదయం పోచవ్వ ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదే రోజు సాయంత్రం సాయిలు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఇద్దరూ మళ్లీ రాజానగర్ ప్రాంతంలో కలుసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలు భావించి ఉండొచ్చని చెప్పారు. ఏదేమైనా భార్యాభర్తలిద్దరూ రూ.6 వేల విషయంలో గొడవ పడి ప్రాణాలు తీసుకోవడం ఇరు కుటుంబాల్లో పెను విషాదం నింపింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.